Covid 19 Medicine: కరోనాకు ఇజ్రాయెల్ టాబ్లెట్.. 5 రోజుల్లోనే వైరస్ ఖతమ్?

కరోనాకు ఇజ్రాయెల్ టాబ్లెట్.. 5 రోజుల్లోనే వైరస్ ఖతమ్? (image courtesy - twitter)

Covid 19 Medicine: ప్రపంచంలో ఉత్తమమైన డాక్టర్లు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. టెక్నాలజీకి తిరుగులేదు. అందువల్లే వాళ్లు పవర్‌ఫుల్ టాబ్లెట్ తయారుచేశారా? వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో చాలా దేశాలు విజయవంతమయ్యాయి. వివిధ కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు అమెరికా, బ్రిటన్, భారత్, రష్యా వంటి దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేశాయి. తుది దశ ట్రయల్స్ పూర్తి కాకముందే టీకా పంపిణీ కూడా ప్రారంభమైంది. కొన్ని దేశాలు గత నెల నుంచే వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నాయి. ముందు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. కానీ వ్యాధి సోకిన వారికి చికిత్సలో భాగంగా అందించే ప్రత్యేక మెడిసిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. తాజాగా కోవిడ్‌-19కు మందు కనిపెట్టామని ఇజ్రాయెల్ చెబుతోంది. తాము అభివృద్ధి చేసిన కోవిడ్ డ్రగ్ 5 రోజుల్లోనే కరోనా వైరస్‌ను నిరోధించిందని ఆ దేశం ప్రకటించింది. వైరస్ లోడ్ మధ్యస్థాయి నుంచి సీరియస్‌గా ఉన్న 30 మంది రోగులకు మందు ఇవ్వగా.. వారిలో 29 మందికి కేవలం 5 రోజుల్లోనే వ్యాధి నయం అయిందని తెలిపింది.

కరోనా వైరస్‌కు మందు కనిపెట్టినట్లు ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్‌లో ఉన్న ఇచిలోవ్ మెడికల్ సెంటర్ తెలిపింది. వైరస్ బారిన పడినవారు వీలైనంత త్వరగా కోలుకునేందుకు ఈ మెడిసిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. కోవిడ్ చికిత్సలో ఇది మంచి ఫలితాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. EXO-CD24 పేరుతో అభివృద్ధి చేసిన ఈ డ్రగ్‌... ఫేజ్ 1 ట్రయల్స్ తాజాగా పూర్తయ్యాయి. వైరస్ లోడ్ మధ్యస్థంగా, తీవ్రంగా ఉన్న 30 మంది రోగులకు ఈ మెడిసిన్ ఇచ్చారు. వీరందరూ ఎలాంటి ప్రమాదం లేకుండా కోలుకున్నారు. రోగుల్లో 29 మంది కేవలం 3 నుంచి 5 రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారని పరిశోధకులు వెల్లడించారు.


ఎలా పనిచేస్తుంది?: కరోనా మరణాలకు కారణమయ్యే సైటోకిన్ స్ట్రోమ్‌ను కొత్త మెడిసిన్ సమర్థంగా నిరోధిస్తోందని ఇచిలోవ్ మెడికల్ సెంటర్‌ ప్రకటించింది. మెడిసిన్ నెక్ట్స్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కానీ అంతకు ముందే వైరస్ ప్రభావంతో ఆరోగ్యం విషమించిన వారికి ఈ మందు ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది.



ఇది కూడా చదవండి: Vastushastra: ఖర్చులు పెరుగుతున్నాయా... వెంటనే ఆ వస్తువుల్ని వదిలించుకోండి

ఊపిరితిత్తులకు సీడీ24 అనే ప్రొటీన్‌ను చేరవేస్తూ.. వైరస్ ప్రభావాన్ని ఈ మందు నిరోధిస్తుందని హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది. కణాల మధ్య పదార్థాలను చేరవేసే ఎక్సోజోమ్‌లు అనే చిన్న క్యారియర్ శాక్‌లను ఇందుకు ఉపయోగించామని పరిశోధకులు తెలిపారు. తీవ్రమైన కరోనావైరస్ కేసులను ఎదుర్కోవడానికి EXO-CD24 మెడిసిన్ సహాయపడనుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది.
Published by:Krishna Kumar N
First published: