Corona Vaccine: ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక.. ఆగస్టు 1 లోపు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి.. లేదంటే..

ప్రతీకాత్మక చిత్రం

NO Vaccine-No Job: కరోనా వైరస్ అనేక రూపాలు సంత‌రించుకుని విజృంభిస్తుండ‌టంతో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం వివిధ దేశాలు కొవిడ్ నిబంధ‌నల‌ను క‌ఠినం చేస్తున్నాయి. తాజాగా ఫిజి దేశం ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాని నుంచి తమను తాము రక్షించుకోవాలంటే టీకా ఒక్కటే మార్గం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం వివిధ దేశాలు కొవిడ్ నిబంధ‌నల‌ను క‌ఠినం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే కొంతమందికి వ్యాక్సిన్ విషయంలో అపోహలు ఉండటంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే అటువంటి వారి విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా 9.30 లక్షల జనాభా ఉన్న దక్షిణ పసిఫిక్ దేశం అయిన ఫిజి ప్రభుత్వం ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. అందేంటంటే.. NO JABS, NO JOBS (టీకాలు తీసుకోకపోతే.. ఉద్యోగాలు ఉండవు) అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆగస్టు 15 లోపు మొదటి ఇంజెక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా సెలవుపై వెళ్లాలని.. నవంబర్ 1 లోగా వారి రెండో డోసు స్వీకరించకపోతే జాబ్ నుంచి పూర్తిగా తొలగించబడతారని అని ఫిజీ ప్రధాని ఫ్రాంక్‌ బైనిమారామా హెచ్చ‌రించారు.

    అలాగే ప్రైవేట్ ఉద్యోగులు అయితే మొదటి డోసును ఆగస్టు 1 లోపు మొదటి డోసు వేసుకోవాలని లేదంటే భారీ జరిమానాలను విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విధానంపై చట్టం కూడా అమలు చేయబడిందని అని బైనీమారామా తన ప్రసంగంలో తెలిపారు. దేశంలో ఒకవైపు డెల్టా వేరియంట్‌తోపాటు మ‌రికొన్ని కొత్త రకాలు విజృంభిస్తుంటే.. కొవిడ్ నిబంధనల విషయంలో ప్రజల నిర్లక్ష్య వైఖరి ఫిజీ ప్రభుత్వాన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోందని, అందుకే కఠిన నిర్ణ‌యం చేయాల్సి వచ్చింద‌ని ఫిజీ ప్ర‌ధాని తెలిపారు. కాగా, మొత్తం సుమారు 9 లక్షల మంది జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకు దాదాపు 3,40,000 మంది వయోజనులు టీకా మొదటి డోసు వేయించుకున్నారు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో 8,600 కేసులు, 48 మరణాలు సంభవించాయి.

    టీకా తీసుకోవడం వల్ల తాను తాను ఎటువంటి దుష్ప్రభావాలను అనుభవించలేదని ప్రధాని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కరోనా వేసుకుంటే అయస్కాంతంగా మరడం అనేవి తనకు ఏం జరగలేదని.. ఇటువంటివి ఎవరూ నమ్మవద్దని తన దేశ ప్రజలకు సూచించారు. కరోనా నిబంధనలకు ఎవరైనా ఉల్లంఘిస్తే అక్కడిక్కడే భారీ జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. కరోనా జయించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
    Published by:Veera Babu
    First published: