కరోనా క్రూరత్వం.. 1800 దాటిన మృతులు..

Coronavirus : కరోనా వైరస్.. మరింత క్రూరంగా దాడి చేస్తోంది. చైనాలో దాని బారిన పడి మృతిచెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఇప్పటి దాకా 1,868 మంది దీని బారిన పడి మృతి చెందారు.

news18-telugu
Updated: February 18, 2020, 1:12 PM IST
కరోనా క్రూరత్వం.. 1800 దాటిన మృతులు..
Coronavirus బాధితుడు (file)
  • Share this:
Coronavirus : కరోనా వైరస్.. మరింత క్రూరంగా దాడి చేస్తోంది. చైనాలో దాని బారిన పడి మృతిచెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఇప్పటి దాకా 1,868 మంది దీని బారిన పడి మృతి చెందారు. నిన్న ఒక్క రోజే 98 మంది చనిపోయారని చైనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదీకాక.. కొత్తగా 1,800 కేసులు నమోదు అయ్యాయి. బాధితుల సంఖ్య 72,500కు చేరింది. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నా.. మరణాల సంఖ్య పెరగడంపై ఆ దేశ ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా, కరోనా వైరస్ ఆ దేశ కరెన్సీపైనా పడింది. నోట్ల ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉందని గ్రహించిన అధికారులు.. కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయించారు. వైరస్ తీవ్ర ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్పత్రులు, మార్కెట్లు, బస్సుల్లో నగదు తీసుకుని తిరిగి ప్రజలకు ఇవ్వబోమని, వాటి స్థానంలో 85.6 బిలియన్ డాలర్ల విలువైన కరెన్సీని ముద్రిస్తున్నామని అధికారులు తెలిపారు.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు