ఓ జైలులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 600 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. ఈ ఘటన పెరూలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెరూలోని మిగల్ క్యాస్ట్రో జైలులో కరోనా వైరస్ విజృంభించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వార్తలతో భయాందోళనకు గురైన ఖైదీలు, తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పెరూలో సుమారు 600 మంది ఖైదీలకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖైదీలు తమను వెంటనే విడుదల చేయాలంటూ హింసాత్మక చర్యలకు దిగారు. ఏకంగా జైలు గోడలు ఎక్కి పారిపోయేందకుు ప్రయత్నించడమే కాకుండా మంచాలను సైతం తగలబెట్టారు. అడ్డొచ్చిన జైలు సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. ఈ హింసాత్మక ఘటనల్లో 9 మంది చనిపోగా, 60 మంది జైలు సిబ్బంది, ఐదుగురు పోలీసు అధికారులు, ఇద్దరు ఖైదీలకు గాయాలయ్యాయి. పెరూలో ఇప్పటివరకు మొత్తం 31 వేల మందికి కరోనా వైరస్ సోకగా 800 మంది దాకా చనిపోయారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.