కరోనా వల్లే విమాన ప్రమాదం... పార్లమెంట్‌లో పాకిస్థాన్ మంత్రి ప్రకటన

విమాన నడుపుతున్నంత సేపు పైలెట్లు కరోనా, దాని ప్రభావం గురించే చర్చించారని పాక్ మంత్రి తెలిపారు.

news18-telugu
Updated: June 24, 2020, 6:11 PM IST
కరోనా వల్లే విమాన ప్రమాదం... పార్లమెంట్‌లో పాకిస్థాన్ మంత్రి ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వల్ల విమాన ప్రమాదం జరిగిందనే వార్త వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పాకిస్థాన్ విమానయాన శాఖ మంత్రి సర్వర్ ఖాన్ ఇదే విషయాన్ని స్వయంగా ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించారు. గత నెల 22న కరాచీలో జరిగిన విమాన ప్రమాదంలో 97 మందికిపైగా చనిపోయారు. పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ విమానం.. కరాచీ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందే ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్ట్ సమీపంలోనే విమానం కుప్పకూలిపోవడంతో... అందులోని వారంతా చనిపోయారు. అయితే ఈ ప్రమాదానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో పాటు పైలెట్ తప్పిదం కూడా ఉందని నివేదిక ఇచ్చారు.

అయితే పాక్ విమానయాన శాఖ మంత్రి సర్వర్ ఖాన్... ఈ ప్రమాదానికి కారణం పైలెట్ల నిర్లక్ష్యంతో పాటు కరోనా వైరస్‌పై వాళ్లు చేస్తున్న చర్చే కారణమని పార్లమెంట్‌కు వివరించారు. విమాన నడుపుతున్నంత సేపు పైలెట్లు కరోనా, దాని ప్రభావం గురించే చర్చించారని ఆయన చెప్పారు. వాళ్లు విమానం నడపడంపై దృష్టి పెట్టలేదని... విమానం ఎత్తు పెంచాలని టవర్ కంట్రోల్ కోరినప్పటికీ తాము మేనేజ్ చేస్తామని అతివిశ్వాసం వ్యక్తం చేశారని సర్వర్ ఖాన్ అన్నారు. ఈ ప్రమాదానికి విమానంలో సాంకేతిక లోపం కారణమనే వాదనను మంత్రి సర్వర్ ఖాన్ ఖండించారు. అప్పటికే మే 7 నుంచి ఈ విమానం ఆరుసార్లు సర్వీసులు అందించిందని వివరించారు. పైలెట్లు సైతం విమానంలో సాంకేతిక లోపం ఉందనే విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదని అన్నారు. మొత్తానికి కరోనా సంక్షోభంలో జరిగిన విమాన ప్రమాదానికి కరోనానే కారణం కావడం గమనార్హం.

First published: June 24, 2020, 6:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading