భారతీయులకు గుడ్‌న్యూస్... H1B వీసా, గ్రీన్ కార్డ్‌లపై గడువు పెంపు...

Corona Lockdown | Corona Update : అమెరికా అధ్యక్ష ఎన్నికలు వస్తున్న సమయంలో... ఎన్నారైల ఓట్లపై కన్నేసిన ట్రంప్ సర్కార్... జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది.

news18-telugu
Updated: May 2, 2020, 12:46 PM IST
భారతీయులకు గుడ్‌న్యూస్... H1B వీసా, గ్రీన్ కార్డ్‌లపై గడువు పెంపు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)
  • Share this:
Corona Lockdown | Corona Update : విదేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిని కట్టడి చేస్తూ... అమెరికన్లకే స్థానిక ఉద్యోగాలు దక్కేలా చెయ్యాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్... ఆ దిశగా రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల విదేశీ వలసదారులకు 60 రోజులపాటు గేట్లు మూసేసిన ట్రంప్... తాజాగా... ఎన్నారైలకు కాస్త మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా కలిగివున్నవాళ్లు, గ్రీన్ కార్డ్‌లు ఉన్నవారు... కరోనా వైరస్ దృష్ట్యా... కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వారు వెంటనే కాకుండా... కనీసం 60 రోజుల్లో పత్రాలు సమర్పించవచ్చని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.

H1B వీసా ద్వారా... అమెరికాలో కంపెనీలు... విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వగలవు. ఏటా ఇలా వేల మంది ఇండియా, చైనా నుంచి వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక గ్రీన్ కార్డ్ అనేది అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది. ట్రంప్ విదేశీ వలసదారులకు బ్రేక్ వెయ్యడంతో... H1B వీసాకు అప్లై చేసుకున్నవారు, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నవారు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం అమెరికాలో... గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది అప్లై చేసుకోగా, వారిలో H-1B వీసా కలిగివున్నవారు 2 లక్షల మంది దాకా ఉన్నారు. వీరికి 60 రోజుల టైమ్ ఇచ్చారు కాబట్టి... విదేశీ వలసదారులపై నిషేధం గడువు (60 రోజులు) పూర్తవగానే... వీళ్లంతా తమ తమ పత్రాల్ని ఆమోదింపజేసుకునేందుకు వీలుకానుంది.

ప్రస్తుతం అమెరికాలో 11 లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్ ఉండగా... మృతుల సంఖ్య 65 వేలకు పైనే ఉంది. రోజూ కొత్తగా 30 వేల కేసులు నమోదవుతుండగా... 1500 మందికి పైగా చనిపోతున్నారు.
First published: May 2, 2020, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading