షేవింగ్ క్రీమ్‌లో 29 బాల్స్... గిన్నీస్ రికార్డ్... వైరల్ వీడియో...

Corona Lockdown | Corona Update : ఏదైనా కొత్తగా చేస్తే... అది గిన్నీస్ బుక్ ఎక్కే అవకాశం ఉంటుంది. ఇది అలాంటిదే.

news18-telugu
Updated: May 10, 2020, 8:08 AM IST
షేవింగ్ క్రీమ్‌లో 29 బాల్స్... గిన్నీస్ రికార్డ్... వైరల్ వీడియో...
షేవింగ్ క్రీమ్‌లో 29 బాల్స్... గిన్నీస్ రికార్డ్... వైరల్ వీడియో... (credit - YT - David Rush)
  • Share this:
Corona Lockdown | Corona Update : షేవింగ్ క్రీములో బంతుల్ని నిలబెట్టాలనే ఆలోచన చిత్రమైనదే. అమెరికా... ఇడాహో రాష్ట్రంలో... లాక్‌డౌన్ సమయంలో... కొందరికి ఈ ఆలోచన వచ్చింది. వెంటనే అలా చేద్దామని డిసైడ్ అయ్యారు. వెంటనే మార్కెట్‌కి వెళ్లి.... పింగ్ పాంగ్ బాల్స్, షేవింగ్ క్రీమ్ తెచ్చారు. ఇదివరకు ఓ కుర్రాడు తన పెన్‌తో పింగ్ పాంగ్ ఆడి.. ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలూ పొందాడు. ఇప్పడు వీళ్లేమో... షేవింగ్ క్రీమ్‌ని తలకు రాసుకొని... దానిపై ఎన్ని బంతుల్ని నిలబెట్టగలం అన్న ఆట ఆడారు. జస్ట్ 30 సెకండ్లలో 29 బాల్స్ నిలబెట్టి... గిన్నీస్ బుక్ రికార్డ్ కొట్టారు.

డేవిడ్ రష్, జనొథ్ హన్నన్ ఆలోచన ఇది. తలపై ఎక్కువ బంతులు పట్టేందుక వీళ్లు... షేవింగ్ క్రీమ్‌లో ఓ గొయ్యి ఏర్పాటు చేశారు. ఆ గొయ్యి లోకి బాల్స్ విసిరారు. అలా... 30 సెకండ్లలో మొత్తం 29 బాల్స్ నిలబెట్టగలిగారు. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన యూట్యూ్బ్ వీడియోను చాలా మంది చూసి... సూపర్, అదిరింది, వాట్ యాన్ ఐడియా అంటున్నారు.


ఐతే... ఇది కొత్త ఆలోచన కాదనీ... స్విట్జర్లాండ్‌కి చెందిన డ్యూడ్ పర్ఫెక్ట్ అనే స్టంట్ టీమ్... 2019లో ఇలాంటిది ఆడి.. 21 బాల్స్‌ని నిలబెట్టారని డేవిడ్ రష్ తెలిపారు. ఐతే... ఈ ఇద్దరికీ రికార్డులు కొత్తేమీ కాదు. ఇదివరకు డేవిడ్ రష్... STEM ఎడ్యుకేషన్ ప్రమోషన్ కోసం... దాదాపు 100 రకాల రికార్డుల్ని బ్రేక్ చేశాడు.
Published by: Krishna Kumar N
First published: May 10, 2020, 8:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading