చైనాకి షాక్ ఇచ్చిన అమెరికా... వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలు...

Corona Lockdown | Corona Update : కరోనా వైరస్ చైనా వల్లే తమకు వ్యాపించిందని బలంగా నమ్ముతున్న అమెరికా... చైనాను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

news18-telugu
Updated: April 28, 2020, 11:19 AM IST
చైనాకి షాక్ ఇచ్చిన అమెరికా... వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలు...
చైనాకి షాక్ ఇచ్చిన అమెరికా... వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలు... (File)
  • Share this:
Corona Lockdown | Corona Update : అమెరికా అధ్యక్షుడిగా ఏ బరాక్ ఒబామానో ఈ టైంలో ఉండి ఉంటే... పరిస్థితి ఇలా ఉండేది కాదేమోగానీ... ఇప్పుడున్నది ట్రంప్ కావడం వల్ల... ఆయన సొంత దూకుడు నిర్ణయాలు... అమెరికాతోపాటూ... ఇతర దేశాలకూ సమస్యలు తెస్తున్నాయి. తాజాగా... కరోనా వైరస్ విషయంలో చైనా సంగతి తేల్చుతామంటున్న ట్రంప్... మరోసారి వాణిజ్య ఆంక్షలకు దిగారు. సైనిక పరికరాలు, టెక్నాలజీ వస్తువుల ఎగుమతుల విషయంలో ఉన్న రూల్స్‌ని మరింత కఠినం చెయ్యబోతున్నారు. ఇకపై వాటిని అమెరికా నుంచి చైనా, రష్యా, వెనిజులా కొనాలనుకుంటే... ముందుగా అమెరికా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ప్రభుత్వానికి తెలియకుండా అలాంటి వస్తువుల్ని అమెరికా నుంచి ఆ మూడు దేశాలకూ ఎగుమతి చేస్తే ట్రంప్ ఊరుకోరు.

ట్రంప్ సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం... చైనా, రష్యా, వెనిజులా దేశాల్లో చాలా కంపెనీలు ఇలాంటి పరికరాల్ని అమెరికా నుంచి కొంటున్నాయి. తీరా అవి తమ దేశాలకు వచ్చాక... వాటిని పక్కదారి పట్టిస్తున్నాయి. చివరకు ఆ వస్తువులతో అమెరికాకే ప్రమాదం జరుగుతోందన్నది ట్రంప్ ప్రభుత్వ వాదన. టెక్నాలజీ తప్పుదారి పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కఠిన రూల్స్ తేబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల రక్షణ కోసం వస్తువులు కొనాలనుకున్నా... అమెరికా ప్రభుత్వానికి చెప్పి తీరాల్సిందే.

నిజానికి ఇది పెద్ద మేటరే కాదనీ... ఎలాగైనా చైనాను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే కోరనా వైరస్ విషయంలో చైనాపై భారీ ఎత్తున పరిహారం రాబట్టే ఆలోచనలో ఉన్న ట్రంప్... చైనాను అన్ని రకాలుగా దెబ్బతియ్యాలనే ఉద్దేశంతోనే అడ్డమైన కండీషన్లు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Published by: Krishna Kumar N
First published: April 28, 2020, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading