కరోనా (corona) ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షలాది మందిని కోవిడ్ బలి తీసుకుంది. చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోయాయి. పలు దేశాలు లాక్డౌన్లను విధించాయి. కరోనా రెండో వేవ్ (Corona Second wave) చాలా దేశాల్లో వచ్చింది. ఇక మూడో వేవ్ వస్తుందేమో అని ఇప్పటికే పలు దేశాలు ఆందోళనగా ఉన్నాయి. కాగా, కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికే మూడో వేవ్ రాగా.. అక్కడ కరోనా నాలుగో వేవ్ కూడా తలుపుతడుతోంది. రష్యా (Russia) కోవిడ్ విజృంభణతో విలవిలాడుతోంది. గత కొన్ని రోజుల క్రితం తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ రోజువారీ కేసులు (corona cases) భారీగా నమోదవుతున్నాయి. అంతేకాదు రోజుకు వెయ్యికి మందికి పైగా కరోనాతో మరణిస్తున్నారు. ఇక తాజాగా జర్మనీ (Germany)లో కరోనా కేసులు అధికమయ్యాయి. దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ జర్మనీని హడలెత్తిస్తోంది. రోజుకు 76 వేలకు పైనే కోవిడ్ కేసులు (covid cases) నమోదు కావడం అక్కడ వణుకుపుట్టిస్తోంది. ఇప్పటివరకూ లక్షకు పైగా మరణాలు సంభవించినట్లు జర్మనీ ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
విమానాల్లో తరలింపు..
కరోనా కేసుల (corona cases) ఉధృతి ఎంతలా ఉందంటే ఆస్పత్రులన్ని కరోనా రోగులతో కిటకిటలాడిపోవడంతో ఆ రోగులను వేరే ఆస్పత్రలకు తరలించే నిమిత్తం ఆఖరికి వైమానికి దళాన్ని కూడా రంగంలోకి దింపింది. అంతేకాదు జర్మనీ 9germany)లోని దక్షిణ నగరం అయిన మెమ్మింగెన్ ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉన్న కరోనా రోగులను ఉత్తర ఓస్నాబుక్ సమీపంలోని ముయెన్‌స్టర్‌కు తరలిస్తున్నారు. దీనికోసం జర్మనీ విమానంలో "ఫ్లయింగ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు" గా పిలిచే ఆరు పడకల ఐసీయూని ఏర్పాటు చేసింది. జర్మనీ విమానాలను (flights) ఈ విధంగా వినియోగించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో బెర్లిన్ ఈ కొత్త కరోనా వేరియంట్‌ని గుర్తించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాను కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రాంతంగా ప్రకటించనుందని జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొత్త వేరియంట్ బి.1.1.529..
ఈ కొత్త వేరియంట్‌ని బి.1.1.529 పిలుస్తారని, ఇది యాంటీబాడీ (anti bodies)లు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగల సామర్థ్యం గలదని దక్షిణాఫ్రికా శాస్రవేత్తలు ప్రకటించారు. ఈ మేరకు కొత్తగా గుర్తించిన ఈ వేరియంట్ మరిన్ని సమస్యలను సృష్టింస్తుందన్న ఆందోళనతోనే తాము ముందుగానే తగు చర్యలు తీసుకుంటున్నామని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ చెప్పారు.
జర్మనీలకు మాత్రమే ఎంట్రీ...
దక్షిణాఫ్రికా (south Africa) నుంచి తమ దేశీయులు జర్మనీకి రావడానికి మాత్రమే విమానాలు (flights) అనుమతిస్తామని, పైగా వ్యాక్సిన్‌లు తీసుకున్నవారితో సహా అందరూ 14 రోజులు క్యారంటైన్‌లో ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Germany