CORONA CASES ARE INCREASING IN NEWZEALAND AND GERMANY EVK
Covid 19 Cases : పెరుగుతున్న కేసులు.. జర్మనీ, న్యూజిలాండ్‌లో ఆంక్షలు
ప్రతీకాత్మక చిత్రం
Covid 19 : కరోనా (Corona) కట్టడిలో ప్రారంభ దశలో ఎంతో బాగా కట్టడి చేసిన దేశాలు ఇప్పుడు కరోనా దెబ్బకు విలవిల లాడుతున్నాయి. న్యూజిలాండ్, జర్మనీ (Germany) దేశాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ (New Zealand) లో డెల్టా వేరియంట్ విజృభిస్తుంది.
కరోనా (Corona) కట్టడిలో ప్రారంభ దశలో ఎంతో బాగా కట్టడి చేసిన దేశాలు ఇప్పుడు కరోనా దెబ్బకు విలవిల లాడుతున్నాయి. న్యూజిలాండ్, జర్మనీ (Germany) దేశాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ (New Zealand) లో డెల్టా వేరియంట్ విజృభిస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 206 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అధికంగా అక్లాండ్లో 200 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం ఆ నగరంలో కోవిడ్ 19 (Covid 19) ఆంక్షలను విధించాయి. న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు 12 ఏళ్ల పైన ఉన్న వారికి 78శాతం మంది పూర్తి టీకా తీసుకొన్నారు. మొదటి డోస్ (First Dose) తీసుకొన్న వారు 89శాతం మంది ఉన్నారు. అయినా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
మూడు నెలలుగా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నా.. తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం ఆంక్షలను ఎత్తి వేసే పనిలో ఉంది. ఎంత కాలం ఆంక్షలు విధిస్తాం అనే అభిప్రాయాన్ని ఆ దేశ ప్రభుత్వాధినేతలు వ్యక్తి పరుస్తున్నారు.
దేశంలో 78శాతం టీకా పూర్తయినా కేసులు పెరుగుతుండం ఆందోళన కలిగించేదిలా ఉండని ఆ దేశ వైద్య బృందాలు పేర్కొంటున్నాయి. కరోనా ప్రారంభ దశలో విజయవంతంగా కేసులు కట్టడి చేసిన దేశం ఇప్పుడు కోవిడ్ తీవ్రతతో ఇబ్బందులు పడుతోంది.
జర్మనీలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ (Virus) వ్యాప్తి ప్రపంచ మంతా అధికంగా ఉన్నప్పుడు కూడా రాని కేసులు ఇప్పుడు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో ఐసీయూ రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీనిపై జర్మనీ దేశ ఆరోగ్య మంత్రి జెన్స్స్పాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి దాకా కోవిడ్ వ్యాక్సిన్ (Vaccine) పూర్తి చేసుకొన్న వారు కూడా తిరిగి ఆరునెలల తరువాత కూడా బూస్టర్ డోస్ (Booster Dose) తీసుకోవాలని సూచిస్తున్నారు. దేశ ప్రజలు కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకొనేలా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.
దేశంలో పరిస్థితులు ఇలానే కొనసాగితే లాక్డౌన్ (Lock Down) విధించాల్సి వస్తుందని ప్రభుత్వంలోని వారు పేర్కొంటున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే దేశంలో 37,120 కొత్త కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ కేసుల పెరుగుదలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. జర్మనీలో 83 మిలియన్ల జనాభాలో 60శాతం మాత్రమే వ్యా క్సినేషన్ (Vaccination) తొలి డోసు పూర్తయింది. అందరూ ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదు. అయినా ప్రభుత్వం బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచిస్తోంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.