కరోనా (corona) ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షలాది మందిని కోవిడ్ బలి తీసుకుంది. చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోయాయి. పలు దేశాలు లాక్డౌన్లను విధించాయి. కరోనా రెండో వేవ్ (Corona Second wave) చాలా దేశాల్లో వచ్చింది. ఇక మూడో వేవ్ వస్తుందేమో అని ఇప్పటికే పలు దేశాలు ఆందోళనగా ఉన్నాయి. కాగా, కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికే మూడో వేవ్ రాగా.. అక్కడ కరోనా నాలుగో వేవ్ కూడా తలుపుతడుతోంది. రష్యా (Russia) కోవిడ్ విజృంభణతో విలవిలాడుతోంది. గత కొన్ని రోజుల క్రితం తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ రోజువారీ కేసులు (corona cases) భారీగా నమోదవుతున్నాయి. అంతేకాదు రోజుకు వెయ్యికి మందికి పైగా కరోనాతో మరణిస్తున్నారు. గత 24 గంటల్లో COVID-19 రెండవ అత్యధిక రోజువారీ మరణాలు నమోదయినట్లు ఆరోగ్య శాఖ (health ministry) తెలిపింది. రష్యా (Russia)లో ఆదివారం COVID-19తో 1,252 మంది మరణించగా.. శనివారం రికార్డు స్థాయిలో 1,254 మరణాలు నమోదయ్యాయి.
సెయింట్ పీటర్స్బర్గ్లో అత్యధికంగా 74 మరణాలు నమోదు కాగా.. క్రాస్నోడార్ లో 69, రష్యా రాజధాని మాస్కో (mascow) లో 64 మరణాలు సంభవించాయి. రోజు రోజుకీ కరోనా బారిన పడినవారి సంఖ్య (corona cases) అధికమవుతుంది. గత కొన్ని రోజులుగా వరసగా 30 వేలకు పైగా కొత్త కేసులు (corona cases) నమోదవుతున్నాయి. అంతేకాదు రోజూ వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. అక్కడ కరోనా విజృంభణ ఆగకపోవడానికి కారణం.. వ్యాక్సిన్ వేయించుకోవడంలో ప్రజల చూపించిన నిర్లక్షమని అంటున్నారు.
ఇప్పటి వరకూ అదే దేశ జనాభాలో కేవలం 4 0శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అంటే 146 మిలియన్ల జనాభాలో కేవలం 49 మిలియన్ల మం ది మాత్రమే పూర్తిగా టీకా వేయించుకున్నా రు. అంతేకాదు.. ప్రజలు కరోనా నిబంధనలు (Limitations) పాటించడంలో పూర్తిగా అలసత్వం ధోరణి ప్రదర్శిస్తున్నారని.. అందుకనే ఈ మహమ్మారి రోజురోజుకీ పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇక ప్రభుత్వం కరోనా కట్టడి కోసం వేతనంతో కూడిన సెలవులు ఇస్తే.. ప్రజలు విందు, వినోద కార్యక్రమాలకు ఆ సెలవులను ఉపయోగించుకున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. మాల్స్, సినిమా హాల్స్, రెస్టారెంట్స్ పూర్తి స్థాయిలో ప్రజలతో నిండిపోతున్నాయంటే.. అక్కడ ప్రజలు కరోనాని ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు.
ఏదైమైన రష్యా ప్రభుత్వం ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన టీకా పంపిణీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రజలు కరోనని నిర్లక్ష్యంగా తీసుకుంటే ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో రష్యాని చూసి తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదే కోవలో యూరప్ లో కొత్త వేవ్ కారణంగా కరోనా కేసుల (Corona Cases) సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ (Lockdown) విధించాలని యూరప్ (EU)లోని ఆస్ట్రియా దేశం (Austria) నిర్ణయం తీసుకుంది. ఇది ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆ దేశ ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్బర్గ్ (Chancellor Alexander Shalen berg ) అధికారిక ప్రకటన చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona cases, Russia