కారు ఇంజిన్‌లో కొండ చిలువ... వైరల్ వీడియో

Python inside a Car Engine : వాహనాలు పార్క్ చేసేటప్పుడు... ఎండ పడకుండా ఉండాలని చెట్ల కింద పార్క్ చేస్తుంటారు చాలా మంది. ఐతే... ఆ చెట్లపై ఉండే పాములు... అనుకోకుండా... ఆ కార్లలో దూరుతుంటాయి. ఈ ఘటనలో ఏమైంది? కొండ చిలువను ఎలా బయటకు తీశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 7:51 AM IST
కారు ఇంజిన్‌లో కొండ చిలువ... వైరల్ వీడియో
కారు ఇంజిన్‌లో కొండ చిలువ... (Credit - FB - Shelby Township Police Department)
  • Share this:
Python inside a Car Engine : అమెరికా... మిచిగాన్‌లో పోలీసులకు ఓ కాల్ వచ్చింది. తమ కారు ఇంజిన్‌లో కొండ చిలువ ఉందని చెప్పారు కొందరు. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లారు. మహిళా ఆఫీసర్ ఫెట్టిగ్... కారు బానెట్ ఓపెన్ చేశారు. నాలిక బయటకు తెరుస్తూ... లోపలకు తీసుకుంటూ... ఓ కొండ చిలువ కనిపించింది. జనరల్‌గా లేడీస్... పాముల్ని చూడగానే పాము, పాము అంటూ కంగారు పడతారు. ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. కొండ చిలువో, నేనో తేల్చుకుంటా అన్నట్లుగా ముందుకు కదిలారు. ఎప్పుడైనా కొండ చిలువను పట్టుకోవాలంటే... ముందుగా... దాని తలను కంట్రోల్ చెయ్యాలి. అందుకోసం తలను ముందుగా పట్టుకోవాలి. అలా చేస్తే... ఇక ఆ కొండ చిలువ... అటూ ఇటూ కదల్లేక ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత దాని తోకను పట్టుకొని... వెనక్కి లాగాలి. అప్పుడు అది దేనికీ చుట్టుకోకుండా... ముఖ్యంగా మనకు చుట్టుకోకుండా తప్పించుకోగలం. ఐతే... ఆ మహిళా పోలీస్ ఆఫీసర్... ఈ రూల్సేవీ పాటించలేదు. అది కొంచెం చిన్న పామే కావడంతో... చటుక్కున దాని నడుం పట్టుకొని... బాక్సులో వేసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది షెల్బీ టౌన్‌షిప్ పోలీస్ విభాగం.ఈ క్లిప్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్సే వస్తోంది. టన్నుల కొద్దీ రియాక్షన్స్ వస్తున్నాయి. #CantMakeThisStuffUp, #TheEngineIsMakingAWeirdNoise, #opeRope వంటి హ్యాష్ ట్యాగ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఆమె చాలా ధైర్యవంతురాలని కొందరు అంటే... తాను ఉడుత, పిల్లిని కార్ ఇంజిన్‌లో చూశాననీ, కొండచిలువను చూడటం ఇదే మొదటిసారి అని మరో నెటిజన్ స్పందించారు. తన కారులో కొండ చిలువ ఉంటే... తనకు హార్ట్ ఎటాక్ వచ్చేదని మరో నెటిజన్ భయపడుతూ తెలిపారు.

 

ఇవి కూడా చదవండి :

Peanut Butter Fruit : ఈ ఫ్రూట్ విశేషాలు తెలుసా మీకు?

Health Tips : కొబ్బరి పాలతో హెయిర్ స్పా... ఇలా చెయ్యండిDussehra 2019 : దసరా ప్రత్యేకతలేంటి? ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది?
Published by: Krishna Kumar N
First published: September 24, 2019, 7:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading