జకీర్‌ను భారత్‌కు అప్పగించం: మలేసియా ప్రధాని

తమ దేశంలో పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ ఉన్నందున, ఆయన్ను భారత్‌కు అప్పగించలేమని మలేసియా ప్రధాని చెబుతున్నారు.

news18-telugu
Updated: July 6, 2018, 5:51 PM IST
జకీర్‌ను భారత్‌కు అప్పగించం: మలేసియా ప్రధాని
జకీర్ నాయక్(ఫైల్ ఫోటో)
  • Share this:
వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌కు మలేసియా ప్రభుత్వం అభయం ఇచ్చింది. మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాల కేసుల్లో నిందితుడైన జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించబోమని మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ స్పష్టంచేశారు. 2016లో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో మారణ హోమం సృష్టించిన యువకులు జకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రేరేపితమైనట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదుకావడంతో భారత్‌ నుంచి వెళ్లిపోయిన జకీర్ నాయక్‌ మలేసియాలో తలదాచుకుంటున్నారు. మలేసియా ప్రభుత్వం ఆయనకు పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ కూడా ఇచ్చింది. జకీర్ నాయక్‌ను తమ దేశానికి అప్పటించాలని ఇది వరకే భారత విదేశాంగ శాఖ మలేసియా ప్రభుత్వాన్ని కోరింది. ఈ దిశగా మలేసియా ప్రభుత్వంపై దౌత్యాధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు.

అయితే జకీర్ నాయక్‌‌ మలేసియాలో ఇబ్బందులు సృష్టించనన్ని రోజులు ఆయన్ను భారత్‌కు అప్పగించబోమని మలేసియా ప్రధాని మహితిర్ స్పష్టంచేశారు. తమ దేశంలో పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ ఉన్నందున, ఆయన్ను భారత్‌కు అప్పగించలేమని తేల్చిచెప్పారు. త్వరలోనే జకీర్ నాయక్‌కు వెనుదిరిగి రానున్నట్లు కథనాలు రాగా...తనకు అలాంటి ఉద్దేశం లేదని ఆయన స్పష్టంచేశారు. మీడియాలో తనపై వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్న ఆయన...తనను భారత దర్యాప్తు అధికారులు కేసుల పేరుతో వేధింపులకు గురిచేయడం ఆపే వరకు భారత్‌కు వెనుదిరిగే యోచన లేదని చెప్పారు.

Published by: Janardhan V
First published: July 6, 2018, 3:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading