Home /News /international /

CONTROVERSIAL ART DEALER DAUGHTER WILL RETURN OVER 100 ANTIQUITIES CAMBODIA GOVERNMENT SU GH

అంతర్జాతీయ స్మగ్లర్ కుమార్తె సంచలన నిర్ణయం.. విస్తుపోయే ఆ విషయాలు చూస్తే షాకే

(Image Credit: Matthew Hollow/Royal Government of Cambodia)

(Image Credit: Matthew Hollow/Royal Government of Cambodia)

డౌగ్లస్ లాచ్ఫోర్డ్ స్మగ్లింగ్ కింగ్ గా పేరుగాంచారు. కాంబోడియా దేశానికి చెందిన అత్యంత విలువైన పురాతన వస్తువులను చోరీ చేయటంతోపాటు ఆ పనిలోనే తన జీవితాన్ని కొనసాగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

డౌగ్లస్ లాచ్ఫోర్డ్ స్మగ్లింగ్ కింగ్ గా పేరుగాంచారు. కాంబోడియా దేశానికి చెందిన అత్యంత విలువైన పురాతన వస్తువులను చోరీ చేయటంతోపాటు ఆ పనిలోనే తన జీవితాన్ని కొనసాగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న డౌగ్లస్ ఇందుకు తనకు బ్రిటిష్ కలెక్టర్ ఒకరు సహకరించినట్లు, అధికారుల సహకారంతోనే తాను ఈ భారీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకోగలిగినట్టు వివరించటం విస్తుగొలుపుతోంది. ఇందులో భాగంగా ఫేక్ రికార్డులను సృష్టించి..పలు పురావస్తు ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు జరిపి సంపదను లూటీ చేసినట్టు డౌగ్లస్ వివరించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విష్ణు ఆలయం అంకోర్ వాట్ కూడా వారు తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో ఒకటి కావడం విశేషం. అపురూపమైన సంపదైన ఇలాంటి అరుదైన పురాతన వస్తువులను క్రయవిక్రయం చేయటంలో 1970 నుంచి డౌగ్లస్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తనపై ఉన్న ఆరోపణలకు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే 88 ఏళ్ల వయసులో థాయ్ లాండ్ లో ఆయన కన్నుమూశారు. అయితే ఆయన కుమార్తె నవపన్ క్రియాంగ్సక్ మాత్రం తన తండ్రి నుంచి తనకు వారసత్వంగా సంక్రమించిన ఈ కాంబోడియన్ కళాఖండాలను తిరిగి ఇచ్చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో సుమారు వందకు పైగా విగ్రహాలు, శిల్పాలు ఉండడం గమనార్హం. కాంబోడియా దేశ సాంస్కృతిక వారసత్వంలో భాగమైన వీటిని తిరిగి అందించడం ఓ పెద్ద విశేషమనే చెప్పాలి.

అపురూపమైన సంపద..
ఈ సంపదను కాంబోడియా జాతీయ మ్యూజియం పెనామ్ పెన్ లో భద్రపరచేందుకు ప్రస్తుతం ఈ మ్యూజియాన్ని విస్తరిస్తున్నారు. దీనిపై కాంబోడియా సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేస్తూ..ఇది కేవలం మట్టి, మెటల్, చెక్కతో చేసిన ఆకృతులు మాత్రమే కావని అంతకంటే అపురూపమైనవని వెల్లడించింది. వీటికి ఆత్మ, ఇంద్రియాలు కూడా ఉన్నందునే ఇవి వాటంతట అవి స్వదేశానికి తిరిగివస్తున్నాయని పేర్కొంది. ఇక వీటిలో ఇప్పటికే 25 వస్తువులు కాంబోడియా మ్యూజియం చేరుకున్నాయి. మరికొన్ని అతి త్వరలో స్వదేశానికి దిగుమతి కానున్నాయి. 10వ శతాబ్దానికి చెందిన శివుడు, స్కంద విగ్రహాలు కూడా వీటిలో ఉన్నాయి. ఈ కళాఖండాలు తిరిగి దేశానికి రాబోతున్నాయన్న వార్త ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఫోరుంగ్ సాకోనా వెల్లడించారు.

విచారణ జరిపిస్తాం..
అయితే మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపనున్నట్టు కాంబోడియా ప్రభుత్వం వెల్లడించింది. అసలు ఇవి ఎలా చోరీకి గురయ్యాయో, ఎవరెవరి హస్తం ఉందో, చేతులు మారిన క్రమాన్ని ఆమూలాగ్రం విచారణ జరపనుంది. అయితే ఈ జాతీయ సంపదను దేశానికి తిరిగి ఇచ్చేయటం సరైన నిర్ణయంగా తాను భావిస్తున్నట్టు స్మగ్లర్ కుమార్తె ప్రకటించారు. 20వ శతాబ్దంలో ఇక్కడి పాలకులు అంతర్గత యుద్ధ వాతావరణాన్ని సృష్టించి, కేవలం అధికారం కోసం ఆరాటపడటంపై దృష్టి నిలపటంతో దేశ చరిత్ర, సంపదను అస్సలు పట్టించుకోలేదు. ఇదే అదనుగా అంతర్జాతీయ స్మగ్లర్లు దేశ వారసత్వ సంపదను లూటీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ స్మగ్లర్ గా పేరుగాంచిన లాచ్ఫోర్డ్ కు బ్రిటిష్, థాయ్ పౌరసత్వం ఉండటంతో వీటిని సులువుగా దొంగలించగలిగినట్లు నేరారోపణలున్నాయి. కానీ ఆయన కుమార్తె మాత్రం.. తన తండ్రి ఈ వారసత్వ సంపదను ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల జరిగిన వేలం పాటల్లో కొన్నారని చెప్పుకొస్తున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో కనీసం 50 మిలియన్ డాలర్ల పైమాటే.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Smuggling

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు