Plane Missing: ప్రయాణికులతో వెళ్తున్న విమానం మిస్సింగ్.. హెలికాఫ్టర్లతో గాలింపు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రమాణికులతో వెళ్తున్న ఓ విమానంతో ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోల్ సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానంలో 29 మంది ప్రయాణికులు ఉన్నారు.

  • Share this:
    flప్రమాణికులతో వెళ్తున్న ఓ విమానంతో ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోల్ సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానంలో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. రష్యా తూర్పు ప్రాంతంలో ఉన్న కమ్చట్కా ద్వీపకల్పంలో విమానం కనిపించకుండా పోయిందని రష్యా అధికారులు మంగళవారం వెల్లడించారు. వివరాలు.. కమ్చట్కాలోని ప్రధాన నగరమైన పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చాట్స్కీ నుంచి పలానా నగరానికి వెళ్తున్న విమానం అదృశ్యమైందని.. షెడ్యూల్ ప్రకారం ల్యాండ్ కాలేదని స్థానిక  రవాణా కార్యాలయం అధికార ప్రతినిధి వాలెంటినా గ్లాజోవా AFPకి తెలిపారు. దీంతో అప్రమత్తమై విమానం కోసం గాలింపు చేపట్టినట్టు పేర్కొన్నారు. విమానంలో 23 మంది ప్రయాణికులతో పాటుగా, ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు చెప్పారు.

    విమానం ఆచూకీ తెలుసుకోవడానికి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్టు వాలెంటినా గ్లాజోవా చెప్పారు. ప్రస్తుతానికి విమానంతో సంబంధాలు కోల్పోయామనే సమాచారం మాత్రమే ఉందన్నారు. ఈ విమానాన్ని కమ్చట్కాలోని స్థానిక విమానయాన సంస్థ నిర్వహిస్తుందని తెలిపారు. మరోవైపు విమానంలో 28 మంది ఉన్నారని రష్యా న్యూస్ ఏజెన్సీలు స్థానిక అధికారులను ఉటంకిస్తూ పేర్కొన్నాయి. అందులో ఆరుగురు విమాన సిబ్బందితో పాటు, ఒకరు లేదా ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపాయి.

    చదవండి: Students Kidnap: 140 మంది పాఠశాల విద్యార్థుల కిడ్నాప్.. ఆయుధాలతో స్కూల్‌లోకి ప్రవేశించి..

    అయితే విమానం కనిపించకుండా పోవడంపై రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి విమానం సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని, మరోకటి పలానా పట్టణం సమీపంలోని ఓ బొగ్గు గని ప్రాంతంలో కూలిపోయి ఉండొచ్చని స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి. ఇక, విమానం ఆచూకీ కోసం రెండు హెలికాఫ్టర్‌లతో అన్వేషణ చేపట్టారు. సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసి.. అందుబాటులో ఉంచారు. ఇక, కమ్చట్కా ప్రాంతం రష్యాకు తూర్పుగా ఉన్న ద్వీపకల్పం.
    Published by:Sumanth Kanukula
    First published: