PM Modi tells congrats to shehbaz sharif: పాకిస్థాన్ దేశానికి షెహబాజ్ షరీఫ్ నూతన ప్రధానిగా సోమవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత దేశం శాంతి కాముక దేశం. ఇక్కడ ఉగ్రవాదులు లేరని అన్నారు. ఉగ్రవాద రహితంగా భారత్ శాంతిని కోరుకుంటుందన్నారు.
తమ దేశం ఎల్లప్పుడు శాంతి, స్థిరమైన అభివృద్ధిని కోరుకుంటుందని అన్నారు. దేశం అభివృద్ధిని చేందే దిశలో రాబోయే సవాళ్లలను ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఎల్లప్పులు ప్రజలు శ్రేయస్సు కోసమే పాటుపడుతుందని మోదీ అన్నారు. అదే విధంగా నూతన ఎన్నికైన ప్రధాని షెహబాజ్ పాక్ మీడియా సమావేశంలో జమ్ముకశ్మీర్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై మోదీ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ భారత్ అంతర్గత విషయమని స్పష్టం చేశారు.
Prime Minister Narendra Modi congratulates newly elected Pakistan PM Shehbaz Sharif
India desires peace & stability in a region free of terror, so that we can focus on our development challenges & ensure the well-being and prosperity of our people, tweets PM Modi pic.twitter.com/Xkr4CkENWG
Shehbaz Sharif elected Pakistans 23rd Prime Minister: పాక్ లో ఇమ్రాన్ ఖాన్ స్థానంలో నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ 23వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన జనరల్ అసెంబ్లీ అవిశ్వాస ఓటింగ్ లో ఇమ్రాన్ ఖాన్ ఓటమిపాలయ్యారు. దీంతో పార్లమెంట్ సోమవారం పాక్ కు 23వ ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్‌ను ఎన్నుకుంది. షెహబాజ్ కు పాక్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ఆయన ఎన్నికకు మార్గం సుగమమైంది. మూడు సార్లు పాక్ కు ప్రధానిగా పనిచేసిన నవాబ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ ఖాన్. ఆయనపై గతంలో మనీలాండరీంగ్ విషయంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
మూడు సార్లు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసి ప్రస్తుతం బ్రిటన్ లో తలదాచుకుంటున్న నవాజ్ షరీఫ్ సోదరుడే షెహబాజ్ షరీఫ్. 70 ఏళ్ల షెహబాజ్ షరీఫ్.. ఇప్పుడు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో తమ కుటుంబానికి కంచుకోట అయిన పాక్ లోని పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా షెహబాజ్ షరీఫ్ పనిచేశారు. ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేయడంలో షెహబాజ్ షరీఫ్ పేరు గడించారు. తన ప్రసంగాలలో విప్లవ కవిత్వాన్ని ఉటంకించడంలో ప్రసిద్ధి చెందాడు. షెహబాజ్ ఫరీష్ ను వర్క్హోలిక్ గా చెప్పవచ్చు. అయితే షెహబాజ్ షరీఫ్ కు చాలా మంది భార్యలు ఉన్నారు. ఆయన బహుళ వివాహాలు మరియు లండన్ మరియు దుబాయ్‌లోని లగ్జరీ అపార్ట్మెంట్లను కలిగి ఉన్న ఆస్తి పోర్ట్‌ఫోలియో గురించి విపక్షాలు,మీడియా ఎంత ప్రచారం చేసినా కూడా ఆయనకు ఉన్న ప్రజాదరణ చెక్కుచెదరలేదనే చెప్పవచ్చు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.