news18-telugu
Updated: November 26, 2019, 6:14 PM IST
అమెరికా వైట్‌హౌస్‌లో అరుదైన సత్కారం అందుకున్న శునకం..
ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీని హతమార్చడంలో కీలకపాత్ర పోషించిన బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకానికి అరుదైన గౌరవం దక్కింది. కొనాన్ బాగ్దాదీని అంతమొందించే ఆపరేషన్ లో కీలక పాత్రను నిర్వర్తించింది. ఈ శునకానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఆతిథ్యం ఇచ్చారు. కొనాన్ ట్రయినర్ తో కలిసి వైట్ హౌస్ లో ట్రంప్, ఆయన భార్య మెలానియా ఉల్లాసంగా గడిపారు. కొనాన్ రాకకు సంతోషిస్తున్నామని, కొనాన్ వైట్ హౌస్ లో అడుగుపెట్టడం గౌరవంగా భావిస్తున్నామని ట్రంప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా పాల్గన్నారు. ఈ సందర్బంగా కొనాన్ ను రియల్ హీరో అంటూ అభివర్ణించారు.
Published by:
Krishna Adithya
First published:
November 26, 2019, 6:14 PM IST