ప్రపంచయుద్ధాల్లో ఇదో విప్లవాత్మకమైన ముందడుగు అనుకోవచ్చు. పైలెట్లతో నడిచే యుద్ధ విమానాల స్థానంలో అమెరికా త్వరలో... స్వయంగా పనిచేసే యుద్ధ విమానాల్ని ప్రవేశపెట్టబోతోంది. 2021 జులై నుంచి ఇవి అమెరికా ఆర్మీలోకి వస్తాయని తెలిసింది. ఈ యుద్ధ విమానాల్లో పైలెట్లు ఉండరు. శత్రువులపై దాడి విషయంలో విమానాలే సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. ఇందుకోసం వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇస్తున్నారు. ఇప్పటివరకూ యుద్ధాల్లో శత్రువులు... పైలెట్ల విమానాల్ని కూల్చేస్తున్నారు. దీని వల్ల పైలెట్లు చనిపోతున్నారు. ఇకపై ఆ పరిస్థితి లేకుండా అమెరికా... ఈ సరికొత్త డ్రోన్ విమానాల్ని తేబోతోంది. మిలిటరీలో ఇదో గొప్ప ముందడుగు అని ఎయిర్ ఫోర్స్ మేగజైన్ తెలిపింది.
2018లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. పైలెట్లు ఉండే ఫైటర్ జెట్‌ల స్థానంలో డ్రోన్లను తెస్తున్నారు. ప్రస్తుతానికి ఈ డ్రోన్లు భూమిపై కాకుండా... గాలిలోనే దాడులు చేసేలా తయారుచేశారు. అంటే... శత్రు దేశాల విమానాలు గాల్లో వస్తున్నప్పుడు ఈ డ్రోన్ విమానాలు... దాడులు చెయ్యగలవు. ఐతే... వీటిని పైలెట్లు కూడా కంట్రోల్ చెయ్యగలిగేలా తయారుచేశారు. అంటే... విమానంలో పైలెట్ లేకపోయినా... అది అతను ఆర్డర్ ఇచ్చినట్లుగా చెయ్యగలదు. అలాగే... దాడులు కూడా చేయగలదు.
అమెరికా మిలిటరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎక్కువగా ఉపయోగించాలనే వాదనలు ఏళ్లుగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అంటే భవిష్యత్తులో యుద్ధాలన్నీ మనుషుల(ఆర్మీ)తో డైరెక్టుగా సంబంధం లేకుండా జరిగే ఛాన్స్ ఉంది. తద్వారా సైనిక మరణాల్ని ఆపొచ్చు. ఐతే... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నట్లుగా పనిచేస్తుందా? విమానాలు... సరైన నిర్ణయాలు తీసుకుంటాయా అన్నది తేలాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.