news18-telugu
Updated: March 22, 2019, 7:53 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆహారమైనా.. ఆరాధనైనా.. ఆఖరికి మోహమైనా.. పరిధి దాటి వ్యవహరిస్తే అనర్థాలకు దారితీయడం ఖాయం. అందుకే 'అతి' అన్నివేళలా మంచిది కాదన్న సంగతి గుర్తెరగాలి. ఈ విషయాన్ని విస్మరించి.. శృంగార సంతృప్తిని శిఖరాలకు చేర్చేందుకు నాన్‌స్టాప్ సెక్స్‌లో పాల్గొన్న ఓ జంట.. చివరకు తమ రతి కార్యకలాపాన్ని విషాదంతో ముగించాల్సి వచ్చింది. కొలంబియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
లా ఫియెరా(32) అనే మహిళ తన భాగస్వామితో శృంగారంలో పాల్గొనేందుకు ఓ హోటల్ రూమ్ బుక్ చేసుకుంది. ఎప్పటిలా రొటీన్ సెక్స్ కాకుండా.. ఈసారి ఆ జంట కాస్త కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు. దీంతో ఇద్దరూ డ్రగ్స్ తీసుకుని శృంగారంలో దిగారు. అలా దాదాపు ఐదు గంటల పాటు నాన్‌స్టాప్ సెక్స్‌లో పాల్గొన్నారు. అలా శృంగారం చేస్తుండగానే.. ఫియెరాలో ఉన్నట్టుండి చలనం ఆగిపోయింది. దీంతో కంగారుపడ్డ ఆమె భాగస్వామి ఆమెను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.ఫియెరాను పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో ఆమె చనిపోయినట్టు ధ్రువీకరించారు. డ్రగ్స్ తీసుకుని అతిగా శృంగారంలో పాల్గొనడం వల్లే ఆమె చనిపోయినట్టు వారు నిర్దారించారని సమాచారం.
Published by:
Srinivas Mittapalli
First published:
March 22, 2019, 7:53 AM IST