Video : ఆస్కార్ రేంజ్‌లో నటిస్తున్న కుక్క... మనుషుల్ని మించిపోయిందిగా...

Thailand : ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో... ఎవర్ని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. చివరకు జంతువులు కూడా మనుషుల్ని మోసం చేసే పరిస్థితి వచ్చేస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 31, 2019, 12:27 PM IST
Video : ఆస్కార్ రేంజ్‌లో నటిస్తున్న కుక్క... మనుషుల్ని మించిపోయిందిగా...
తెలివైన కుక్క (Image : Twitter - Mad eagle)
Krishna Kumar N | news18-telugu
Updated: August 31, 2019, 12:27 PM IST
మనం రోజూ రోడ్లపై చూస్తుంటాం... కాళ్లూ చేతులూ విరిగిపోయినట్లుగా కొందరు అడుక్కుంటూ ఉంటారు. వాళ్లకు నిజంగానే వైకల్యం ఉండి ఉంటే... బిక్షాటన చేసుకుంటున్నందుకు వారిపై జాలి పడవచ్చు. దానం చెయ్యవచ్చు. కానీ... మనల్ని మోసం చేసే ఉద్దేశంతో... అన్ని అవయవాలూ ఉన్నా... లేనట్లుగా నటించేవాళ్లు ఈ రోజుల్లో చాలా మంది ఉంటున్నారు. సరే... మనుషులకు తెలివి తేటలు ఎక్కువ కాబట్టి... వాళ్లు అలా మనల్ని మోసం చేస్తున్నారని అనుకోవచ్చు... జంతువులు కూడా అలా చేస్తే ఎలా... థాయ్‌లాండ్‌లో ఓ కుక్క అలాగే చేస్తోంది. కాలు విరగకపోయినా... విరిగిపోయినట్లుగా నటిస్తోంది. అలా రోడ్లపై కాలును ఈడ్చుకుంటూ వెళ్తోంది. అది చూసిన జనం... అయ్యో పాపం అని ఆ కుక్కకు... ఆహారం వేస్తున్నారు. అలా అది చాలా మందిని మోసం చేస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.




ఈ అతి తెలివితేటలున్న కుక్కను బ్యాంకాక్ ప్రజలు గాయ్ అని పిలుస్తున్నారు. చాలా మంది అది తమను మోసం చేస్తోందని తెలిసి కూడా ఆహారం వేస్తున్నారు. కారణం... దాని తెలివితేటల్ని మెచ్చుకోవడం వల్లే. అది అలా ఎలా నటించగలుగుతుందన్నది ఆశ్చర్యకరం. కొన్నేళ్లుగా అది ఆ ట్రిక్స్ ప్లే చేస్తోందని స్థానిక చోంగ్పాపోల్కుల్ తెలిపారు. నిజానికి చోంగ్పాపోల్కుల్... దానికి రోజూ అన్నం పెడుతున్నారు. అయినప్పటికీ... రకరకాల రుచులు మరిగిన ఆ డాగ్... రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు, ప్రజలను అవిటితనం నటిస్తూ ఆకర్షిస్తోంది. దీనికి మరో ఆఫర్ కూడా ఉంది. ఎప్పుడైనా దీనికి నిజంగానే ప్రమాదం జరిగి... ఏ కాలో విరిగిపోతే... దీన్ని తాను పెంచుతానని అక్కడి పెట్ డాగ్ షాప్ ఓనర్ హామీ ఇచ్చారు. సో... గాయ్‌కి రిటైర్మెంట్ టెన్షన్లూ లేనట్లే.
First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...