చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన సుష్మా అనే యువతి అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం 3 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుమారుడు పెళ్లికి అంగీకరించక పోవడంతో మనస్థాపానికి గురై అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది. పూతలపట్టు మండలం బందార్ల పల్లె గ్రామానికి చెందిన మురళి కుమారుడు భరత్ అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వారిద్దరి కుటుంబసభ్యులు చర్చించుకుని పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. పెద్దలు ఈ నెల 3 వతేదీన ఉదయం 3 (తెల్తవారితే గురువారం) వివాహం ఖాయం చేశారు. శుభలేఖలు కూడా ముద్రించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఇలా ఉండగా, వారం రోజుల క్రితం యువకుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయంపై సుష్మ, భరత్ మధ్య పంచాయతీ జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలిసింది. అయితే అంతా సర్దుకుంటారని అనుకున్నారు. పెళ్లికి చేసుకుంటారని సంతోషపడ్డారు. చివరకు తన కుమార్తె మృతి చెందిందని వచ్చిన వార్తతో అవాక్కయ్యారు.
పెళ్లికి భరత్ నిరాకరించడంతోనే సుష్మా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుభలేఖలు ముద్రించి పెళ్లి రోజున ఇలాంటి ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం తమను కలచివేసిందని వాపోయారు. తమకు న్యాయం చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Suicide, United states