చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అరాచకం... తనని విమర్శించిన బిలియనీర్‌కి 18 ఏళ్ల జైలు

భారత ప్రధాని నరేంద్ర మోదీని ఎంతో మంది ఎన్నో విమర్శలు చేస్తారు. కానీ ఏనాడూ ఆయన వాళ్లపై కక్ష కట్టలేదు. పక్క దేశం చైనాలో మాత్రం జిన్‌పింగ్... తాను ఓ అరాచకవాదినని మరోసారి నిరూపించుకున్నారు.

news18-telugu
Updated: September 22, 2020, 1:20 PM IST
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అరాచకం... తనని విమర్శించిన బిలియనీర్‌కి 18 ఏళ్ల జైలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రెన్ జికియాంగ్ (credit - twitter)
  • Share this:
చైనా పేరుకే సామ్యవాద దేశం... నిజానికి అదో మిలిటరీ దేశం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లేదు. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా... ఒక్క మాట కూడా అనకూడదు. అన్నారంటే జైలే గతి. ఇప్పటివరకూ అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిలో మరొకటి చేరింది. చైనాలో బిలియనీర్, రిటైర్డ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రెన్ జికియాంగ్ (Ren Zhiqiang)... ఈమధ్య చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను విమర్శించారు. ఆ విమర్శ ఏంటంటే... కరోనా వైరస్‌ని కంట్రోల్ చెయ్యడంలో ప్రభుత్వం ఫెయిలైందని అన్నారు. అంతే... ఆ మాటకే... జిన్‌పింగ్ రెచ్చిపోయాడు. నరనరానా స్వార్థపూరిత ఆలోచనలు నింపుకున్న ఆయన... తననే విమర్శించారనే ఉద్దేశంతో రెన్‌పై పగబట్టాడు. ఫలితంగా... అవినీతి కేసులో... రెన్ జికియాంగ్‌కి కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

రెన్‌కి చాలా మంది చైనా అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి. మార్చిలో... జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా ఓ ఎస్సై రాశారు. దాన్లో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఆ తర్వాత తనపై జిన్‌పింగ్ చర్యలు తీసుకుంటాడని తెలిసే... అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాతే ఆయనపై అవినీతి కేసు నమోదైంది.మంగళవారం బీజింగ్ కోర్టు... 69 ఏళ్ల రెన్ చాలా తప్పులు చేసినట్లు చెప్పింది. వాటిలో... రూ.120 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారనీ, లంచాలు తీసుకున్నారనీ, తను చేస్తున్న కంపెనీలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని... అక్రమాలకు పాల్పడటం వల్ల ఆ కంపెనీకి రూ.126 కోట్ల నష్టం వచ్చిందని కోర్టు తెలిపింది. ఆయనకు 18 ఏళ్ల జైలు శిక్ష వెయ్యడమే కాదు... రూ.45 కోట్ల ఫైన్ కూడా వేసింది. "రెన్ అక్రమంగా సంపాదించినదంతా రికవరీ అయ్యింది. తను చేసిన నేరాలను రెన్ స్వయంగా ఒప్పుకున్నారు. కోర్టు తీర్పును ఆయన స్వాగతిస్తున్నారు" అని జడ్జి తెలిపారు.

చైనాలో కోర్టు శిక్షలు కఠినంగా ఉంటాయి. 99 శాతం అమలవుతాయి. అందువల్ల ఇక రెన్ జీవితం జైలుకే పరిమితం అనుకోవచ్చు. ఆ దేశంతో పోల్చితే మన ఇండియా చాలా చాలా బెటర్. ఇక్కడ ప్రభుత్వాలను ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా... పాలకులు లైట్ తీసుకుంటారు. అది మనకు ఉన్న స్వేచ్ఛ.


మీకో డౌట్ రావచ్చు. ఎన్నో పనుల్లో ఉండే జిన్ పింగ్... ఎవరో ఓ వ్యక్తి రాసిన ఎస్సేని చూసి... పగబడతాడా అని... చైనా కమ్యూనిస్టు పార్టీలో పనికిమాలిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్ల పనేంటంటే... ఇలాంటివి కనిపెట్టి... జిన్ పింగ్‌కి చెప్పి... లేనిపోని కేసులు బనాయించి... శిక్షలు పడేలా చేస్తారు. ఇందుకు జిన్ పింగ్ సపోర్ట్ వంద శాతం ఉంటుంది. ఇదో రకమైన నియంతృత్వ పాలన.

కోర్టు తీర్పును చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. అంత పెద్ద శిక్ష అవసరమా అని. మున్ముందు ఎవరూ తనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలనే కుట్రతోనే జిన్ పింగ్ ఇంత పెద్ద శిక్ష వేయించి ఉంటాడనే అనుమానాలున్నాయి. చైనాలో వచ్చిన కరోనా వైరస్‌ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్... చైనా వైరస్ అని విమర్శించాడు. అది ట్రంప్ అన్నాడు కాబట్టి సరిపోయింది... అదే మాట... చైనాలో ఎవరైనా అని ఉంటే... జైల్లో చిప్పకూడే గతి అయ్యేది. ఇప్పటివరకూ చైనాను పాలించిన వాళ్లలో జిన్ పింగే డేంజరస్ అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: September 22, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading