సరిహద్దుల్లో చైనా మరో దుశ్చర్య..

బుద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా జన్మదినోత్సవాల్లో బిజీగా ఉన్న సమయంలో చైనా సైన్యం చొచ్చుకొచ్చినట్టు తెలిసింది.

news18-telugu
Updated: July 12, 2019, 8:03 PM IST
సరిహద్దుల్లో చైనా మరో దుశ్చర్య..
చైనా ఆర్మీ (ఫైల్ ఫొటో)
  • Share this:
భారత్ - చైనా సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యం మరో దుశ్చర్యకు తెగించింది. రెండేళ్ల క్రితం అరుణాచల్ ప్రదేశ్‌లోని డోక్లాంలో చైనా సైన్యం.. భారత భూభాగంలోకి దూసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. అయితే, ఈసారి జమ్మూకాశ్మీర్‌లో దుందుడుకు చర్యలకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్‌లోని లేహ్ - లద్దాక్‌లోని భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా సైనికులు.. అక్కడ చైనీస్ జెండాను పాతినట్టుగా ఫొటో బయటకు వచ్చింది. లేహ్‌లోని దెమ్‌ చౌక్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం భారత్ - చైనాలకు అంతర్జాతీయ సరిహద్దు. స్థానికంగా టిబెటన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వారు బుద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా జన్మదినోత్సవాల్లో బిజీగా ఉన్న సమయంలో చైనా సైన్యం చొచ్చుకొచ్చినట్టు తెలిసింది. ‘దలైలామా జన్మోదినోత్సవాన్ని జరుపుకోవడానికి మూడు ప్రాంతాల (చైనా, భారత్, టిబెట్) నుంచి ఇక్కడకు వస్తుంటారు. మేం జాతీయ పతాకాన్ని, టిబెట్ జెండాలు, బుద్ధుల జెండాలు పాతుతాం. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే, దీన్ని అవకాశంగా ములుచుకుని చైనా వారు 6- 7 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి వారి జెండాలు పాతి ఉంటారు.’ అని దేమ్ చౌక్ సర్పంచ్ చెప్పినట్టు టైమ్స్ నౌ తెలిపింది.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>