• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • CHINESE TRAVELLERS EAT 30 KG ORANGES IN 30 MINUTES TO AVOID BAGGAGE CHARGE IN KUNMING AIRPORT KRS

అరగంటలో 30కేజీల ఆరెంజ్​లు తిన్నారు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే

అరగంటలో 30కేజీల ఆరెంజ్​లు తిన్నారు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే

ప్రతీకాత్మక చిత్రం

నలుగురు కలిసి అరగంటలో ఏకంగా 30 కేజీల నారింజ (Orange) పండ్లు తిన్నారు. దీంతో వారి నోళ్లకు పుండ్లు సైతం వచ్చాయి. అసలు వారు ఎందుకిలా చేశారంటే..  

  • Share this:
    లగేజీ ఎక్కువగా ఉంటే విమాన ప్రయాణాల ఖర్చు అమాంతం పెరిగిపోతుంది. ఒక్కోసారి ఇది చెల్లించడం ప్రయాణికులకు తలకు మించిన భారం అవుతుంది. ఇలా లగేజీ చార్జీలను తగ్గించుకునేందుకు కొందరు కొన్ని మార్గాల్లో ప్రయత్నిస్తారు. అయితే ఇది మాత్రం విభిన్నం.. ఎవరూ చేయలేని పని కూడా కావొచ్చు.

    లగేజీ చార్జ్ ఎక్కువవుతుందని నలుగురు ప్రయాణికులు ఏకంగా అర గంటలో 30 కేజీల నారింజ పండ్లు తినేశారు. చైనా యునాన్ ప్రావిన్స్​లోని కున్మింగ్ ఎయిర్​పోర్టులో ఈ ఘటన జరిగింది.

    వాంగ్ అనే వ్యక్తి తన సహచరులతో కలిసి కున్మింగ్​కు బిజినెస్ ట్రిప్ వచ్చాడు. 50 యువాన్లకే 30 కిలోల ఆరెంజ్​లు వచ్చే సరికి వారు కొనుగోలు చేశారు. అయితే విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన వారికి షాక్ ఎదురైంది. ఇవి తమ వెంట తీసుకెళ్లాలంటే ఏకంగా 300 యువాన్లు లగేజీ చార్జ్ చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పారు.

    ప్రతీకాత్మక చిత్రం


    ఆరెంజ్​లను కొన్న ధర కంటే ఆరు రెట్ల చార్జ్ ఎక్కువగా ఉండడంతో వాంగ్​.. ఆయన సహచరులు ఓ నిర్ణయానికి వచ్చారు. వాటిని వేస్ట్ చేయకుండా.. చార్జ్ చెల్లించకుండా ఉపాయం చేశారు. ఎయిర్​పోర్టులోనే వాటిని తీనేయాలని అనుకున్నారు. అక్కడే నిలబడి నలుగురు 30 నిమిషాల్లోనే 30 కేజీల పండ్లు తినేశారు. అయితే ఒక్కసారిగా అన్ని ఆరెంజ్​లు తినేసరికి వారిలో కొందరి నోళ్లకు ఏకంగా పుండ్లు అయ్యాయి. తాను మళ్లీ ఇప్పట్లో ఆరెంజ్​లను తినను అని వాంగ్ చెప్పారు.



    ఎయిర్​పోర్టులోనే అంత మొత్తంలో తినడంతో అక్కడి వారు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆన్​లైన్​లోని ఈ ఘటన వైరల్​గా మారింది. ఒకవేళ ప్యాక్ చేయించుకోకపోతే.. నలుగురు నాలుగు భాగాలుగా చేసుకొని క్యాబిన్​లో తీసుకెళ్లొచ్చు కదా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
    Published by:Krishna P
    First published:

    అగ్ర కథనాలు