Home /News /international /

CHINESE SPY SHIP CLEARED TO DOCK AT LANKA PORT AMID CONCERNS IN INDIA PVN

China Spy Ship : భారత్ పై నిఘా కోసం చైనా షిప్..ఆ పోర్ట్ లో నిలిపేందుకు శ్రీలంక అనుమతి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chinese spy ship to Sri Lanka : భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా నిఘా పడవకు శ్రీలంక(Sri Lanka)అనుమతించింది. చైనాకు చెందిన కీలక రీసెర్చ్ నౌక యువాన్ వాంగ్‌-5(Yuan Wang 5) హంబన్ తోట నౌకాశ్రయంలో లంగ‌ర్ వేసేందుకు శ్రీ‌లంక ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Chinese spy ship to Sri Lanka : భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా నిఘా పడవకు శ్రీలంక(Sri Lanka)అనుమతించింది. చైనాకు చెందిన కీలక రీసెర్చ్ నౌక యువాన్ వాంగ్‌-5(Yuan Wang 5) హంబన్ తోట నౌకాశ్రయంలో లంగ‌ర్ వేసేందుకు శ్రీ‌లంక ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. హిందూ మహాసముద్రంపై, శ్రీలంకపై చైనా తన ఇన్‌ఫ్లుయెన్స్ పెంచుకున్నట్టు మన దేశం భావిస్తోంది. ఈ రెండింటిపై చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువాన్ వాంగ్ 5 పడవను స్పేస్, శాటిలైట్‌ల ట్రాకింగ్ కోసం పంపుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. యువాన్ వాంగ్‌-5 నౌక రీసెర్చ్ స‌ర్వే నౌక అని ఇంట‌ర్నేష‌న‌ల్ షిప్పింగ్ అండ్ అన‌లిటిక్స్ వెబ్‌సైట్లు చెబుతున్నాయి. కానీ భార‌త్ మాత్రం ఇది డ్యుయ‌ల్-యూజ్ నిఘా నౌక అని చెబుతోంది. శ్రీ‌లంక‌లో ఈ నౌక‌ను నిలిపి భారత కార్యకలాపాలు, భారత మిలిటరీ కేంద్రాలు సహా పలు సంస్థ‌ల‌పై నిఘా పెట్టేందుకు చైనా ప్ర‌య‌త్నిస్తుంద‌ని భారత్ ఆందోళ‌న‌.

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంలో చైనా ఈ పడవను వినియోగించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో చైనా నిర్మించిన పోర్టు హంబంటోటాకు రావడాన్ని భారత్ అభ్యంతరం చెప్పింది.  నిజానికి ఈ షిప్ ఆగస్టు 11వ తేదీనే హంబన్ తోట నౌకాశ్రయం రావల్సింది. కానీ, భారత్ అభ్యంతరాల మేరకు శ్రీలంక అనుమతులు ఇవ్వలేదు. కానీ, తాజాగా మళ్లీ ఆ షిప్‌కు అనుమతి ఇచ్చింది. చైనాకు చెందిన స్పై షిప్ యువాన్ వాంగ్ 5 ఈ నెల 16 నుంచి 22 మధ్య రావడానికి అనుమతి ఇస్తున్నట్టు శ్రీలంక విదేశాంగ శాఖ తెలిపింది.

India@75 : అంతరిక్షం నుంచి భారత్ కు శుభాకాంక్షలు చెప్పిన సమంత

యువాన్‌ వాంగ్‌-5.. క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల క‌ద‌లిక‌ల‌ను ట్రాక్ చేసే సామ‌ర్థ్యం ఉంది. 750 కిమీల‌కు పైగా దూరంలో గ‌ల ప్రాంతాల‌పై నిఘా పెట్ట‌గ‌ల స‌త్తా దీని సొంతం. అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆరు నౌకాశ్ర‌యాల‌పై స్పై చేయ‌గ‌లుగుతుంది. అందుకే హంబంతోట పోర్ట్‌కు యువాన్ వాంగ్-5 నౌక రావ‌డానికి భార‌త్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ది. మొత్తం 4 వందల మంది సిబ్బంది ఈ నౌకలో ఉంటారు. దీన్ని చైనా అంతరిక్ష విభాగంతో పాటు సైనిక విభాగం అధికారులు నియంత్రిస్తుంటారు. అత్యంత అధునాతన టెక్నాలజీ ఇందులో ఉండటంతో ఈ నౌక ద్వారా ఒడిశా తీరం వెంబడి వీలర్ ఐలాండ్‌లో భారత్ చేపట్టే బాలిస్టి‌క్ క్షిపణి ప్రయోగాలను అంచనా వేయడానికి, వాటి సామర్థ్యంపై పూర్తి వాస్తవ స్థాయి సమాచారాన్ని రాబట్టుకోవడానికి చైనాకు వీలవుతుంది. అంటే భారత క్షిపణుల రేంజ్‌ను కచ్చితంగా అంచనా వేయడానికి ఈ నౌక ద్వారా చైనాకు వీలవుతుంది.

ఇక, హంబన్ తోట ఓడరేవు(Hambantota port)నిర్మాణానికి శ్రీలంక 2009లో చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో 2017లో హంబన్ తోట ఓడరేవును 99 ఏళ్లపాటు చైనాకు లీజుగా అప్పగించింది. ఈ రేవును చైనీయులకు అప్పగించడం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ఇతర రుణాల చెల్లింపునకు వాడామని అప్పటి శ్రీలంక ప్రభుత్వం చెప్పుకుంది.

ఈ షిప్ శ్రీలంక వస్తుండటాన్ని తాము దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత రక్షణ, ఆర్థిక ప్రయోజనాల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: China, India, Ship, Sri Lanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు