Chinese Spies: 10 మంది గూఢచారులు అరెస్ట్.. కాళ్ల బేరానికి వచ్చిన చైనా.. క్షమాపణ చెప్పి మరీ..

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (ఫైల్ ఫోటో)

గత డిసెంబర్ నెలలో ఓ దేశంలో చైనా దురాగతానికి పాల్పడింది. దాన్ని కాస్తా ఆ దేశం కనిపెట్టడంతో ప్రపంచ దేశాలకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు నానా పాట్లు పడింది. ఆ దేశంతో కాళ్లబేరానికి వచ్చింది. చివరకు ఆ దేశం పెట్టిన కండీషన్లకు ఒప్పుకుని ఓ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.

 • Share this:
  కాబూల్: విస్తరణ వాదంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో చైనా అకృత్యాలకు పాల్పడుతోంది. రహస్య ఎజెండాతో ఆయా దేశాల్లో గూఢచారులను సృష్టిస్తోంది. తాజాగా గత డిసెంబర్ నెలలో ఓ దేశంలో చైనా దురాగతానికి పాల్పడింది. దాన్ని కాస్తా ఆ దేశం కనిపెట్టడంతో ప్రపంచ దేశాలకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు నానా పాట్లు పడింది. ఆ దేశంతో కాళ్లబేరానికి వచ్చింది. చివరకు ఆ దేశం పెట్టిన కండీషన్లకు ఒప్పుకుని ఓ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. కానీ ఊహించని రీతిలో ఆ దేశంలోని అత్యున్నత స్థాయి అధికారుల ద్వారా విషయం లీకైంది. చైనా పరువు గంగలో కలిసింది. ఆఫ్గనిస్తాన్, చైనా మధ్య జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ కు సంబంధించిన విషయాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  ఆఫ్గాన్ గతేడాది డిసెంబర్ 10న ఓ పది మంది చైనీయులను అదుపులోకి తీసుకుంది. ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న కారణంతో ఆ పది మంది చైనీయులను ఆఫ్గానిస్తాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. పది మంది చైనా ఏజెంట్లు అరెస్టయ్యారన్న వార్త తెలియగానే ఈ కేసును ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ కు అప్పగించాలని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సూచించారు. ఈ తరహా ఆపరేషన్లలో ఆయన దిట్ట అని పేరు. అందుకే చైనాతో ఈ విషయమై ఆయనే సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. ఆఫ్గాన్ లో తమ ఏజెంట్లు అరెస్టయ్యారని తెలియగానే చైనా దౌత్యవేత్తలు వెంటనే రియాక్టయ్యారు. ఆఫ్గాన్ తో చర్చలు ప్రారంభించారు. తమ వాళ్లను విడిచిపెట్టాలని కోరారు.

  దీనికి ఆఫ్గానిస్థాన్ ఘాటుగా ప్రతిస్పందించింది. తమ దేశ భూభాగంలోకి గూఢచారులను పంపించి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించాలనుకున్న చైనా క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా వారిని విడిచిపెట్టేందుకు కొన్ని కండీషన్లను కూడా పెట్టినట్టు సమాచారం. తప్పేదేమీ లేక చైనా వాటన్నింటికీ ఓకే చెప్పి ఆ పది మంది గూఢచారులను డిసెంబర్ 2న ఓ ప్రత్యేక విమానంలో తీసుకెళ్లింది. ఈ చర్చల్లో ప్రధాన భాగస్వామ్యం ఉన్న ఓ కీలక అధికారి ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. డిసెంబర్ 10న చైనా గూఢచారులను అదుపులోకి తీసుకున్నా.. వారిపై కేసును నమోదు చేయకుండా ఆఫ్గాన్, కొన్ని కీలక డిమాండ్లను నెరవేర్చుకుందని తెలుస్తోంది.

  కాగా ఆఫ్గాన్ లో పట్టుబడిన ఈ పది మంది చైనీయుల్లో ఇద్దరికి హక్కానీ చైనా ఉగ్రవాద సంస్థగా పేరొందిన హక్కానీ గ్రూపుతో కాంటాక్టులు ఉన్నాయని తేలింది. షా హంగ్ అనే వ్యక్తి కాబూల్ లో ఓ రెస్టారెంట్ నడుపుతూ చైనాకు సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడని తేలింది. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అంగీకారంతోనే వారిని చైనాకు తిరిగి పంపినట్టు అధికారులు వెల్లడించారు. కాగా వారి అరెస్ట్ గురించి ఆ దేశ మీడియాలో వార్తలు రావడంతో అమ్రుల్లా సాలేహ్ స్పందించారు. డిసెంబర్ 27న తన ఫేస్ బుక్ ఖాతాలో ఆ వార్తలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఎవరో కిడ్నాపర్లను అరెస్ట్ చేశామనీ, వారేమీ చైనీయులు కాదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ విషయం కాస్తా ప్రపంచమంతా తెలియడంతో చైనా పరువు పోగొట్టుకున్నట్టయింది.
  Published by:Hasaan Kandula
  First published: