CHINESE SOCIAL MEDIA ABUZZ WITH RUMOURS OF XI JINPING STEPPING DOWN FOR COVID 19 MISMANAGEMENT PVN
Xi Jinping : చైనాలో కీలక పరిణామం..అధ్యక్ష పదవికి జిన్ పింగ్ రాజీనామా!
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్(ఫైల్ ఫొటో)
Xi Jinping stepping down : చైనా కరెన్సీ యువాన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 4శాతం వరకు పడిపోయింది. గత 28ఏళ్లలో ఇంత కనిష్ఠానికి పడిపోవడం ఇదే తొలిసారి. కరోనా ఒక్క కారణం తప్ప ఆర్థిక వ్యవస్థ గురించి జిన్‌పింగ్ ఆలోచించలేదని, ప్రజలను ఇబ్బందిపెట్టడమే గాక ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి కారణమయ్యారని జిన్ పింగ్‌పై విమర్శలు వచ్చాయి.
Xi Jinping stepping down : కరోనా వైరస్(Coronavirus) కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభణతో అక్కడి పలు నగరాల్లో ఆంక్షలు,లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. చైనా(China)లో కరోనా కట్టడి కోసం జిన్‌పింగ్.. జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. చైనాలోని పలు నగరాల్లో ప్రజలకు బలవంతంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న వీడియోలు కూడా ఇటీవల బయటికొచ్చాయి. అయితే బలవంతంపు క్వారంటైన్ కూడా అక్కడ అమలు చేస్తున్నట్లు చైనీయులు వాపోతున్నారు. దీంతో జిన్‌పింగ్‌పై చైనీయుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అంతేగాక వ్యాపార సంస్థలపై కూడా ఆంక్షల వల్ల తీవ్ర ప్రభావం పడింది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ కూడా ప్రభావితమైంది.
చైనా కరెన్సీ యువాన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 4శాతం వరకు పడిపోయింది. గత 28ఏళ్లలో ఇంత కనిష్ఠానికి పడిపోవడం ఇదే తొలిసారి. కరోనా ఒక్క కారణం తప్ప ఆర్థిక వ్యవస్థ గురించి జిన్‌పింగ్ ఆలోచించలేదని, ప్రజలను ఇబ్బందిపెట్టడమే గాక ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి కారణమయ్యారని జిన్ పింగ్‌పై విమర్శలు వచ్చాయి. అయితే ఇటువంటి సమయంలో చైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ చైనీస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కరోనా నిర్వహణలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా, చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి జిన్ పింగ్ (Xi Jinping)తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ఆయనను చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) పక్కకు పెట్టబోతోందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇటీవలే జరిగిన సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం మొదలైంది. చైనా పాలనలో ఈ నాయకత్వ బృందమే అత్యంత కీలకం.
ఇదిలా ఉండగా,కెనడాకు చెందిన ఓ బ్లాగర్ ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్ను తదుపరి చైనా అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని పేర్కొన్నాడు. అంతకన్నా ముందు చైనా కమ్యూనిస్టు పార్టీ ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేసి జిన్‌పింగ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించనుందని ఓ వీడియో సందేశంలో తెలిపాడు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.