Home /News /international /

CHINESE RESEARCHERS DEVELOP DEVICE THAT CAN TEST LOYALTY TO RULING PARTY UMG GH

China: డ్రీమ్ మెషీన్‌లా.. చైనా ఓ వెరైటీ డివైజ్ ఆవిష్కరణ.. అది ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..!

రూలింగ్ పార్టీ కోసం చైనా వినూత్న ఆవిష్కరణ

రూలింగ్ పార్టీ కోసం చైనా వినూత్న ఆవిష్కరణ

అన్ని రంగాలపై స్పష్టమైన ముద్రను చూపుతున్న టెక్నాలజీ.. ఇప్పుడు ఏకంగా పార్టీపై కార్యకర్తలకు ఉన్న విధేయతను పరీక్షించే స్థాయికి ఎదిగింది. ఇలాంటి ఒక డివైజ్‌ను అభివృద్ది చేసినట్లు చైనా పరిశోధకులు ప్రకటించారు.

అన్ని రంగాలపై స్పష్టమైన ముద్రను చూపుతున్న టెక్నాలజీ.. ఇప్పుడు ఏకంగా పార్టీపై కార్యకర్తలకు ఉన్న విధేయతను పరీక్షించే స్థాయికి ఎదిగింది. ఇలాంటి ఒక డివైజ్‌ను అభివృద్ది చేసినట్లు చైనా పరిశోధకులు ప్రకటించారు. దీనికి సంబంధించిన కొంత సమాచారం కూడా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. అయితే చైనాలో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఉపయోగిస్తున్న ఈ పద్ధతులపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఫేషియల్ స్కాన్‌లను ఉపయోగించి అధికార చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ-Chinese Communist Party)కి విధేయులుగా ఉన్నవారిని నిర్ధారించే పరికరాన్ని తాము అభివృద్ధి చేశామని తూర్పు చైనా ప్రావిన్స్ అన్‌హుయికి చెందిన పరిశోధకులు తెలిపారు. బీజింగ్‌లో జులై 5న ఈ వివరాలు వెల్లడించారు.

జూన్ 30న Hefei కాంప్రహెన్సివ్ నేషనల్ సైన్స్ సెంటర్‌కు చెందిన Weibo అకౌంట్‌లో ఓ వీడియో అప్‌లోడ్‌ చేశారని, అందులో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంపవరింగ్‌ పార్టీ బిల్డింగ్‌’(AI Empowering Party-Building)కి ఒక ఉదాహరణగా డివైజ్‌ను పేర్కొన్నారని RFA వార్తాసంస్థ తెలిపింది. ఆ తర్వాత Weibo పోస్ట్ తొలగించారు. అయితే జులై 1న అధికార చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన వీడియోకు సంబంధించిన టెక్స్ట్‌ సోమవారం ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో ప్రత్యక్షమైంది. కో ఆర్డినేషన్‌ అవసరమైన సమయంలో వివిధ కార్యకపాలాలను నిర్వహించడంలో పార్టీ-సభ్యుల నాణ్యత సమస్యగా మారుతోందని టెక్స్ట్‌లో ఉంది.

ఈ డివైజ్‌ ఒక రకమైన స్మార్ట్ ఐడియాలజీ, ముఖ కవళికలు, EEG రీడింగ్‌లు, స్కిన్‌ కండక్టివిటీని ఎక్స్‌ట్రాక్ట్‌ చేయడానికి AI టెక్నాలజీని ఉపయోగిస్తుంది. తద్వారా సైద్ధాంతిక, రాజకీయ విద్య(Political Education), ఏకాగ్రత, నైపుణ్యం , సామర్థ్యం అంచనా వేయడం ఈ డివైజ్‌కు సాధ్యపడుతుంది. ఇది సైద్ధాంతిక, రాజకీయ విద్య నిర్వాహకులకు నిజమైన డేటాను అందించగలదు. తద్వారా వారు తమ విద్యా పద్ధతులను మెరుగుపరుస్తూ, కంటెంట్‌ను మెరుగుపరుచుకోగలరు. అభ్యర్థులను, కార్యకర్తలను తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుందని సంబంధిత పరిశోధకులు చెప్పారు.అధికార చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీకి ఎంతవరకు విధేయులుగా ఉన్నారు, పార్టీ నాయకత్వాన్ని అనుసరిస్తున్నారా? అనే విషయాన్ని అంచనా వేయడానికి ఇతర పద్ధతులతోపాటు, ఎమోషనల్‌ ఇంటెలిజెంట్‌ కంప్యూటింగ్‌పై డివైజ్‌ ఆధారపడుతుందని పేర్కొంది. వీడియోలో.. హాంగ్ కాంగ్ మింగ్ పావో వార్తాపత్రిక నివేదించినట్లుగా, ఒక పరిశోధకుడు తెలుపు రంగులో ఉన్న గదిలోకి వెళ్లి, పరీక్ష ఎదుర్కోవడానికి స్క్రీన్‌కి ఎదురుగా కూర్చుంటాడు. ఆ తర్వాత పరీక్ష స్కోర్, స్క్రీన్‌పై విశ్లేషణ కనిపిస్తాయని RFA నివేదికలో స్పష్టం చేసింది.

పోస్ట్ తొలగించడానికి ముందు, కొన్ని కామెంట్లు ఈ డివైజ్‌ ఆలోచనను హై-టెక్ బ్రెయిన్ వాష్‌గా ఆరోపించాయి. మరికొందరు జార్జ్ ఆర్వెల్ డిస్టోపియన్ నవల 1984ని ఉదహరిస్తూ ‘బిగ్ బ్రదర్’ చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సున్నితత్వం కారణంగా పోస్ట్‌ను తొలగించినట్లు అన్హుయికి చెందిన సామాజిక శాస్త్రవేత్త సాంగ్ డాన్ తెలిపారు. పార్టీ సభ్యులు, కార్యకర్తల విధేయతను కొలవడానికి హెఫీ సమగ్ర జాతీయ విజ్ఞాన కేంద్రం బయోటెక్నాలజీని ఉపయోగిస్తోందని సాంగ్ చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: China, China apps, International news, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు