నెల రోజుల్లో 23 పెళ్లిళ్లు.. వెంటనే విడాకులు.. తెరవెనుక భారీ స్కాం

ఒకరిని పెళ్లి చేసుకోవడం, వెంటనే విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కనో, చెల్లెలినో మళ్లీ పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇవ్వడం చేశాడు.

news18-telugu
Updated: September 28, 2019, 2:37 PM IST
నెల రోజుల్లో 23 పెళ్లిళ్లు.. వెంటనే విడాకులు.. తెరవెనుక భారీ స్కాం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
11 మంది కలసి ఓ భారీ స్కెచ్ చేసి ప్రభుత్వాన్ని మోసం చేశారు. కేవలం నెల రోజుల్లో 23 సార్లు పెళ్లిళ్లు చేసుకుని, మళ్లీ విడాకులు తీసుకున్నారు. ఒకరిని పెళ్లి చేసుకోవడం, వెంటనే విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కనో, చెల్లెలినో మళ్లీ పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇవ్వడం... ఆ తర్వాత మళ్లీ పాత భార్యనే వివాహం చేసుకోవడం వంటి తంతుకు పాల్పడ్డారు. ఇదంతా ఎందుకు చేశారంటే ఇంటి కోసం. చైనాలోని జీజియాంగ్ ప్రావిన్స్‌లో మురికివాడల్లోని వారికి ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తోంది. ఒక్కో జంటకు 430 చదరపు అడుగుల ఫ్లాట్ ఇస్తుంది. పాన్ అనే వ్యక్తి షీ అనే మహిళను మార్చి 6న పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రభుత్వం వారికి ఇల్లు కేటాయించింది. వెంటనే ఆరు రోజుల్లోనే ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. మరోసారి ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరైంది. ఈ విషయం తెలిసి ఆ ఫ్యామిలీలో మొత్తం 11 మంది ఇలా భార్యలను మార్చి మార్చి పెళ్లిళ్లు చేసుకున్నారు. పాన్ అనే వ్యక్తి షీ అనే తన మాజీ భార్యను మళ్లీ పెళ్లిచేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

First published: September 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు