Home /News /international /

CHINESE MAN FACING URINARY PROBLEM FINDS OUT HE HAS OVARIES AND UTERUS MENSTRUAL PERIODS FOR 20 YEARS MKS

Man Menstrual Periods : పురుషుడికి రుతుస్రావం.. కంగుతిన్న డాక్టర్లు.. చివరికి ఏమైందంటే..

పురుషుడికి రుతుస్త్రావం

పురుషుడికి రుతుస్త్రావం

పురుషుడికి రుతుస్త్రావం అవుతోన్న వింత ఘటన మాత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుస వైద్యపరీక్షల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చివరికి అతను తీసుకున్న నిర్ణయం కూడా అంతే అనూహ్యంగా ఉంది..

ప్రకృతి నియమం ప్రకారం పిల్లల్ని కనే శక్తి స్త్రీజాతి సొంతం. సైంటిఫిక్ టెక్నాలజీ అభివృద్ధి చెందాక ఇటీవల గే-కపుల్ కూడా గర్భందాల్చిన ఉదంతాలున్నాయి. అయితే, పురుషుడికి రుతుస్త్రావం అవుతోన్న వింత ఘటన మాత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుస వైద్యపరీక్షల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చివరికి అతను తీసుకున్న నిర్ణయం కూడా అంతే అనూహ్యంగా ఉంది..

నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన 33 ఏళ్ల పురుషుడికి సంబంధించిన వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అతను గత 20 ఏళ్లుగా మూత్రవిసర్జనఇబ్బందులతో బాధపడుతున్నాడు. మూత్రం ఫ్రీగా పోసుకునేలా యుక్తవయసులో ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. అయితే, సర్జరీ తర్వాత అతని పరిస్థితి ఇంకాస్త వింతగా మారింది.

Heavy Rains : జులైలో 10ఏళ్ల రికార్డు బద్దలు.. మరో 2రోజులు భారీ వర్షాలు.. బయటికి రావొద్దన్న CM KCR


ఆపరేషన్ తర్వాత మూత్రంలో రక్తంతోపాటు పొత్తికడుపు నొప్పి వ‌స్తున్న‌ది. ఇటీవ‌ల క‌డుపునొప్పి నాలుగు గంట‌ల‌కుపైగా కొన‌సాగ‌డంతో డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాడు. డాక్టర్ అతడికి అపెండిసైటిస్ అని నిర్ధారించారు. ఆప‌రేష‌న్ చేశారు. అయినా, క‌డుపునొప్పి త‌గ్గ‌లేదు. అసలేం జరిగిందో కనిపెట్టేందుకు డాక్టర్లు స్కానింగ్ తీయ‌గా, షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

బాధిత వ్యక్తి స్కానింగ్ రిపోర్ట్

Eid al-Adha 2022 : నేడే బక్రీద్.. త్యాగానికి ప్రతీక ఎలా అయింది? పండుగ విశేషాలివే.. Bakrid 2022


20 ఏళ్లుగా ఆ వ్యక్తికి మూత్రం ద్వారా బయటికొస్తున్న రక్తం రుతుస్రావమని డాక్టర్లు నిర్ధారించారు. ఆ వ్యక్తిలో గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని తేలింది. అలాగే, మగ సెక్స్‌హార్మోన్లు ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కంటే తక్కువగా ఉన్నాయ‌ని గుర్తించారు. ఆడ‌ సెక్స్‌హార్మోన్లు, అండాశయ కార్యకలాపాల స్థాయిలు ఆరోగ్యకరమైన వయోజన మహిళల్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్న‌ట్లు డాక్టర్లు క‌నుగొన్నారు.

సర్జరీ నిర్వహించిన డాక్టర్లు



Union Cabinet : కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. తెలంగాణకు మరో బెర్త్.. జగన్ వైసీపీకీ అహ్వానం?


ఆ వ్యక్తి మగ, ఆడ పునరుత్పత్తి అవయవాలతో ఇంటర్‌సెక్స్‌లో జన్మించారని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. అయితే తాను పురుషుడిగానే ఉంటానని, స్త్రీ పునరుత్పత్తి అవయవాలను తొల‌గించాల్సిందిగా ఆ వ్యక్తా డాక్టర్లను రిక్వెస్ట్ చేశాడు. గ‌త నెల‌లో అత‌డికి స్పెషలిస్ట్ హాస్పిటల్‌లో మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఈ నెల నుంచి అతనికి రుతుస్రావం కాబోదని డాక్టర్లు చెబుతున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: China, Health

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు