CHINESE J 7 CRASH WHY CHINA DID NOT PUT ASIDE THEIR VINTAGE FIGHTER JETS WHAT IS THE REASON GH VB
Chinese J-7 Crash: చైనా తమ పాతకాలపు ఫైటర్ జెట్లను ఎందుకు పక్కన పెట్టలేదు.. కారణం ఏంటి..?
ప్రతీకాత్మక చిత్రం
జూన్ 9న సెంట్రల్ చైనాలో ఫైటర్ జెట్ కూలిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయ్యాయి. J-7 శిక్షణ సమయంలో విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నట్లు స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTV పేర్కొంది. పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడిన పైలట్‌ను గాయపడిన ఇతరులతో కలిపి ఆస్పత్రికి తరలించారు.
జూన్ 9న సెంట్రల్ చైనాలో(Central China) ఫైటర్ జెట్(Fighter Jet) కూలిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయ్యాయి. J-7 శిక్షణ సమయంలో విమానాశ్రయం(Airport) సమీపంలో కూలిపోవడంతో కొన్ని ఇళ్లు(Houses) దెబ్బతిన్నట్లు స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTV పేర్కొంది. పారాచూట్(Parachute) సాయంతో సురక్షితంగా బయటపడిన పైలట్‌ను(Pilot) గాయపడిన ఇతరులతో కలిపి ఆస్పత్రికి తరలించారు. హుబీ ప్రావిన్స్‌లోని జియాంగ్యాంగ్లో జరిగిన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చైనా(China) ప్రభుత్వ మీడియా(Government Media) తెలిపింది. జిన్హువా న్యూస్ ఏజెన్సీ పోస్ట్ చేసిన వీడియోలో సంఘటనా స్థలంలో మంటల్లో అనేక ఇళ్లు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రధానంగా కొత్త ఫైటర్ పైలట్ల శిక్షణా స్థలంగా ఉపయోగిస్తున్న లాహోకౌ విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని నివేదికలు తెలుపుతున్నాయి.
చైనాలో శిక్షణ సమయంలో యుద్ధ విమానాలు కూలిపోయిన ఇతర కేసులు ఉన్నాయని నివేదిక తేల్చింది. 2015లో ఒక చైనా వైమానిక దళ పైలట్ తన విమానం కొండపైకి కూలిపోయే ముందు పారాచూట్ సాయంతో బయటపడినట్లు సమాచారం. 2013లో తూర్పు జెజియాంగ్‌లో రాత్రి వేళ శిక్షణ సమయంలో తన ఫైటర్ జెట్ కూలిపోవడంతో ఒక సైనిక పైలట్ మృతి చెందాడు.
చైనా తమ చెంగ్డూ J-7లను పక్కనపెడుతుందా..?
చైనాలో 1962లో ప్రారంభమైన చెంగ్డు J-7 ప్రయాణం.. అప్పుడే MiG-21 టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకోవడంపై బీజింగ్, మాస్కో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయినప్పటికీ సోవియట్ యూనియన్ నుంచి అసంపూర్ణమైన డిజైన్ డాక్యుమెంటేషన్‌ను చైనా అందుకుంది. మొత్తం విమానాన్ని రివర్స్ ఇంజినీర్ చేసిన బీజింగ్.. ప్రారంభంలో జరిగిన తయారీలో నాణ్యత కనిపించలేదు. రెండు సంవత్సరాల తర్వాత 1966 జనవరిలో చైనీస్ J-7 మొదటి విమానాన్నిచైనా యాక్సెప్ట్ చేసింది. అయితే 1980ల నాటికి J-7Eని విడుదల చేసినప్పుడు మాత్రమే జెట్‌ను చైనా అప్‌గ్రేడ్ చేసింది.
ఇప్పటికీ చైనా J-7 జెట్లను వినియోగిస్తున్న దేశాల జబితా విషయానికి వస్తే అందులో ముఖ్యంగా.. బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇరాన్, మయన్మార్, నమీబియా, నైజీరియా, ఉత్తర కొరియా, పాకిస్థాన్, శ్రీలంక, సుడాన్, టాంజానియా, జింబాబ్వేలు ఉన్నాయి. 2008 నుంచి సాంకేతిక సమస్యల కారణంగా అనేక ప్రమాదాలకు గురైన చెంగ్డు J-7లు, కనీసం 10 క్రాష్‌లు జరిగినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. 2008 ఏప్రిల్‌లో టాంగైల్లోని ఘటైల్ సబ్ డిస్ట్రిక్‌లో F-7 (ఎక్స్పోర్ట్ వెర్షన్ ఆఫ్ J-7) క్రాష్ అయిన తర్వాత బంగ్లాదేశ్ పైలట్ మృతి చెందాడు.
2010 మే నెలలో చైనాలోని జినాన్ సమీపంలో ఇంజిన్ వైఫల్యం కారణంగా చైనీస్ PLAAF J-7 కూలింది. గత నెలలో ఇస్ఫాహాన్ నగరం సమీపంలో వారి F7 క్రాష్ కావడంతో ఇద్దరు ఇరాన్ పైలట్లు మృతి చెందారు. చైనా తన J-7 యుద్ధ విమానాల సముదాయాన్ని క్రమంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించిందని, వాటి స్థానంలో మరింత అధునాతన జెట్లను సిద్ధం చేయడం ప్రారంభించిందని నివేదికలు తెలుపుతున్నాయి. తన రక్షణ వ్యయాన్ని పెంచి, సైన్యాన్ని ఆధునీకరించడంపై బీజింగ్ దృష్టి పెట్టింది. పాతవాటి స్థానంలో ఇప్పటికే అధునాతన J-11, J-16 జెట్లను చైనా ప్రవేశపెట్టింది. చైనా నుంచి J-7లను కొనుగోలు చేసిన అల్బేనియా, ఇరాక్ ఇప్పటికే తమ బ్యాచ్ జెట్లను విరమించుకున్నట్లు రిపోర్ట్స్లలో పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.