హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Wang Yi : బోర్డర్ లో టెన్షన్..భారత పర్యటనకు చైనా విదేశాంగ మంత్రి

Wang Yi : బోర్డర్ లో టెన్షన్..భారత పర్యటనకు చైనా విదేశాంగ మంత్రి

China Foreign Minister  Wang Yi : గల్వాన్ ఘటన తర్వాత తొలిసారి ఇండియాకు రానున్నారు చైనా విదేశాంగ మంత్రి. ఈ నేప‌థ్యంలో చైనా మంత్రి వాంగ్ యి రాక ప్ర‌త్యేక‌త సంత‌రించుకోనున్న‌ది. వాంగ్ యి..భారత పర్యటనకు సంబంధించి తేదీలు కుదరాల్సి ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

ఇంకా చదవండి ...

China Foreign Minister India Visit : చైనా-భారత్ మధ్య సయోధ్య దిశగా అడుగులు పడుతున్నాయి. 2020లో తూర్పు లఢఖ్ లోని గల్వాన్ వ్యాలీలో ఘర్షణ తర్వాత నుంచి భారత్-చైనా మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. నాటి నుంచి సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటూ వచ్చింది. అంతకుముందు నుంచే అంటే అదే ఏడాది మేలో భారత జవాన్లు, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భద్రత సిబ్బంది మధ్య తోపులాట చోటు చేసుకుంది. భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ సైన్యాన్ని.. జవాన్లు విజయవంతంగా అడ్డుకున్నారు. అప్పటి నుంచీ లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే వస్తోన్నాయి. అవి ఇప్పటికీ చల్లారట్లేదు.

బోర్డ‌ర్ ప్ర‌తిష్టంభ‌న తొల‌గించేందుకు రెండు దేశాల మ‌ధ్య ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి సైనిక కమాండర్ల స్థాయిలో 15 విడతలుగా చర్చలు జరిగాయి. అయినా అంగీకారం కుదరలేదు. ఏదో ఒక అంశం మీద ప్రతిష్ఠంభన ఏర్పడుతోంది. సరిహద్దు ఒప్పందాలను బీజింగ్ గౌరవించకపోవడమే.. ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై ప్రకటించారు. అయితే ఇటువంటి సమయంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ నెల‌లోనే భారత పర్యటనకు రానున్న‌ట్లు తెలుస్తోంది.

ALSO READ North Korea : మరో మిసైల్ ప్రయోగించిన కిమ్..అయితే క్షణాల్లోనే

గల్వాన్ ఘటన తర్వాత తొలిసారి ఇండియాకు రానున్నారు చైనా విదేశాంగ మంత్రి. ఈ నేప‌థ్యంలో చైనా మంత్రి వాంగ్ యి రాక ప్ర‌త్యేక‌త సంత‌రించుకోనున్న‌ది. వాంగ్ యి..భారత పర్యటనకు సంబంధించి తేదీలు కుదరాల్సి ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. చైనా విదేశాంగ మంత్రి పర్యటన ఖరారైతే 2020 తర్వాత ఇరు దేశాల మధ్య అత్యున్నతస్థాయి సమావేశం ఇదే అవుతుంది. భార‌త్‌కు రావ‌డానికి ముందు ఆయ‌న నేపాల్‌ లోనూ ప‌ర్య‌టించ‌నున్నారు.

First published:

Tags: China, India, Ladakh

ఉత్తమ కథలు