Chaina: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్ కు చేరుకున్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో భారత విదేశంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ తో భేటీ కానున్నారు.
Chinese foreign minister Wang Yi : గత కొన్ని రోజులుగా చైన సరిహాద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. డ్రాగన్ దేశం.. తన కవ్వింపు చర్యలకు పాల్పడుతునే ఉంది. 2020 వ సంవత్సరంలో.. గాల్వాన్ లో చోటు చేసుకున్న ఘర్షణలు, తూర్పు లడఖ్ లో సరిహద్దు ప్రతి ష్టంబన నెలకొన్న తర్వాత.. డ్రాగన్ విదేశాంగ మంత్రి ప్రస్తుతం భారత సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనా విదేశాంగ మంత్రి (China's foreign minister ) వాంగ్ యి తన పర్యటనలో.. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ లతో శుక్రవారం భేటీ కానున్నారు. దీనిలో పలు అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. గతంలో ఇస్లామాబాద్ లో విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆగ్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (OIC)లో జమ్మూకశ్మీర్ పై , వాంగ్ యి (Wang Yi ) పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ అంశంపై భారత్ కూడా చైనాకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్ భారత్ అంతర్గత విషయం.
Chinese Foreign Minister Wang Yi to meet External Affairs Minister Dr S Jaishankar tomorrow at 11 am in Delhi: Sources
దీనిపై వ్యాఖ్యలు చేయడానికి చైనాకు ఎలాంటి హక్కులేదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వాంగ్ యికి సూచించింది. అయితే, చైనా విదేశాంగ మంత్రి పర్యటన గంటల తరబడి తీవ్ర సస్పెన్స్ నెలకొంది. అసలు ఆయన వస్తారో..లేదో.. అన్న సంధిగ్దం చోటు చేసుకుంది. చివరకు ఆయన భారత్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
వాంగ్ యి శుక్రవారం ఉదయం 11 గంటలకు జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ (Ajit Doval), విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ( jai shankar) సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రావడానికి ప్రస్తుత చర్చలు ఉపయోగపడతాయని తెలుస్తోంది. అలాగే ఈ ఎడాది చివరలో బీజీంగ్ లో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు మోదీని ఆహ్వానించడానికి భారత్ పర్యటిస్తున్నట్లు.. పలు జాతీయ మీడియాలలో ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి. వాంగ్ యి రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.