హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్‌కు డ్రోన్ల అమ్మకాలను నిలిపేసిన చైనా డ్రోన్ మేకర్ DJI.. కారణం ఏంటంటే..

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్‌కు డ్రోన్ల అమ్మకాలను నిలిపేసిన చైనా డ్రోన్ మేకర్ DJI.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రష్యా, ఉక్రెయిన్‌తో చైనా డ్రోన్ తయారీ సంస్థ DJI టెక్నాలజీ తాత్కాలికంగా వ్యాపారం నిలిపివేసింది. ఫిబ్రవరిలో దాడులు మొదలైనప్పటి నుంచి రష్యాలో కార్యకలాపాలను నిలిపివేసిన మొదటి అతిపెద్ద డ్రోన్ తయారీదారుగా చైనీస్ సంస్థ నిలిచింది. ఉక్రెయిన్‌, రష్యాతో వ్యాపార కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు DJI ప్రకటించింది.

ఇంకా చదవండి ...

రష్యా(Russia), ఉక్రెయిన్‌తో(Ukraine) చైనా డ్రోన్(China Drone)తయారీ సంస్థ DJI టెక్నాలజీ(Technology) తాత్కాలికంగా వ్యాపారం నిలిపివేసింది. ఫిబ్రవరిలో దాడులు మొదలైనప్పటి నుంచి రష్యాలో(Russia) కార్యకలాపాలను నిలిపివేసిన మొదటి అతిపెద్ద డ్రోన్ తయారీదారుగా చైనీస్ సంస్థ నిలిచింది. ఉక్రెయిన్‌, రష్యాతో వ్యాపార కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు DJI ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాలలో వ్యాపార కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడం గురించి కస్టమర్‌లు, భాగస్వాములు, ఇతర వాటాదారులతో చర్చిస్తున్నట్లు వెల్లడి. తమ ఉత్పత్తులను యుద్ధంలో ఉపయోగించకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. పాశ్చాత్య సంస్థలు ఉక్రెయిన్‌పై దాడులకు నిరసనగా రష్యా నుంచి వైదొలిగినప్పటికీ.. చైనా కంపెనీలు చాలా వరకు అక్కడే ఉన్నాయి. దండయాత్రపై మాస్కోను విమర్శించకుండా ఉండాలనే బీజింగ్ వైఖరికి చైనా సంస్థలు అద్దం పడుతున్నాయి.

ఉక్రెయిన్‌కు లోపాలున్న డ్రోన్‌లను DJI విక్రయించిందా..?

ఉక్రెయిన్ మిలిటరీకి సంబంధించిన డేటాను రష్యాకు DJI లీక్ చేసిందని ఉక్రెయిన్ అధికారులు, పౌరుల ఆరోపిస్తున్నారు. రష్యాకు సాయంచేసేలా ఉద్దేశపూర్వకంగా సాంకేతిక లోపాలు సృష్టించి ఉక్రెయిన్‌కు విక్రయించిందని వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో పౌరుల మరణాలకు కారణమయ్యే పరికరాలను రష్యా వినియోగించేందుకు DJI అనుమతి ఇచ్చిందని ఆరోపణలు వెల్లువెతుత్తున్నాయి. అయితే ఆ ఆరోపణలను పూర్తి అవాస్తవాలంటూ కంపెనీ తోసిపుచ్చింది. రష్యా సైన్యం తమ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నట్లు సూచించే నివేదికలు, ఫుటేజీలను కంపెనీ పరిశీలించింది. అయితే నివేదికలను ధ్రువీకరించని DJI, ఉత్పత్తుల వినియోగంపై నియంత్రణ లేదని ప్రకటించింది. ఉత్పత్తులన్నీ పౌరుల ఉపయోగం కోసం రూపొందించామని, సైనిక దాడుల కోసం కాదని చైనీస్ సంస్థ చెప్పింది.

Apple Smart Bottles: యాపిల్ నుంచి స్మార్ట్ వాటర్ బాటిల్స్.. వీటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?


పశ్చిమం నుంచి ఉక్రెయిన్‌లోకి చేరుకొంటున్న డ్రోన్‌లు..

ఉక్రెయిన్‌లో నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధం కొనసాగుతురడటంతో డ్రోన్‌ల వినియోగానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న దాడులలో డ్రోన్ వార్‌ఫేర్ ప్రధానంగా మారింది. రష్యా స్వదేశీ UAVలను రంగంలోకి దించగా.. ఎక్కువగా పాశ్చాత్య సైనిక సహాయం, డ్రోన్‌లపై ఉక్రెయిన్ ఆధారపడుతోంది. ఇటీవల అర ​​డజనుకు పైగా అమెరికన్ డ్రోన్ స్టార్టప్‌లు ఉక్రెయిన్‌కు పరికరాలను విక్రయించినట్లు లేదా విరాళంగా ఇచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అమెరికన్ డ్రోన్ తయారీదారు బ్రింక్ 10 డ్రోన్‌లను విరాళంగా ఇచ్చిందని, 50 డ్రోన్‌లు విక్రయించిందని రిపోర్ట్స్‌ వచ్చాయి. స్కైడియో ఉక్రెయిన్‌కు అనేక డజన్ల డ్రోన్‌లను విరాళంగా ఇచ్చిందని, అనేక వందల డ్రోన్‌లను NGOలకు విక్రయించిందని, అవి వాటిని విదేశాలకు ఎగుమతి చేశాయని సమాచారం. ఉక్రెయిన్‌కు స్విచ్‌బ్లేడ్స్ వంటి వందలాది ఆయుధాలను యూఎస్‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. స్విచ్‌బ్లేడ్ 300, స్విచ్‌బ్లేడ్ 600 డ్రోన్ మోడల్‌లు ఉక్రేనియన్‌కు చాలా ఉపయోగపడేవిగా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇలాంటివి మరిన్ని సరఫరా చేయడంపై స్విచ్‌బ్లేడ్ UAV తయారీదారు ఉక్రేనియన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. స్విచ్‌బ్లేడ్స్ డ్రోన్‌లను ఉపయోగించేందుకు గతంలో ఉక్రెయిన్‌ సైనికులకు యూఎస్‌ మిలిటరీ శిక్షణ ఇచ్చింది.

Infinix New Smart Phone: కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ కంపెనీ.. బడ్జెట్ ధరల్లో అందుబాటులోకి..


ఉక్రెయిన్‌లో యుద్ధ నియమాలను డ్రోన్‌లు ఎలా మార్చాయి?

ఘోరమైన రష్యా బాంబు దాడులు జరుగుతున్నా.. ఎక్కువగా డ్రోన్ల సహాయంతో తన భూభాగాన్ని ఉక్రెయిన్ రక్షించుకోగలిగింది. ఆక్రమణదారులపై పాప్-అప్ దాడులను నిర్వహించడానికి టర్కిష్ నిర్మిత TB-2 డ్రోన్‌లను ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది. పాశ్చాత్య సైనిక నిపుణులను ఆశ్చర్యానికి గురి చేసిన TB-2 డ్రోన్‌ల ప్రాణాంతక ప్రభావం. Bayraktar TB2 మానవరహిత వైమానిక వాహనాలు తేలికైన లేజర్-గైడెడ్ బాంబులను కలిగి ఉంటాయి, తక్కువ ఎత్తులో సమర్థంగా పోరాడతాయి. 2019 నుండి తూర్పు డోన్‌బాస్ ప్రాంతంలో రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదులతో పోరాడేందుకు టర్కిష్ డ్రోన్‌లను కీవ్‌ ఉపయోగించింది.

రష్యా దాడికి వ్యతిరేకంగా పోరాడేందుకు టర్కీ 20 నుంచి 50 TB2లను ఉక్రెయిన్‌కు అందించి ఉండవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌కు డ్రోన్ విక్రయాల వివరాలను వెల్లడించడానికి టర్కీ అధికారులు నిరాకరించారు. 2020లో అజర్‌బైజాన్‌- ఆర్మేనియా యుద్ధం సహా ప్రపంచవ్యాప్తంగా వివాదాల్లో టర్కిష్ డ్రోన్‌లు కీలకంగా మారాయి. సిరియా, ఉత్తర ఇరాక్‌, టర్కీలోని కుర్దిష్ మిలిటెంట్లపై TB-2 డ్రోన్‌లను కూడా అంకారా ఉపయోగించింది. ఉక్రెయిన్‌కు యూఎస్‌ ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల సైనిక సహాయంలో డ్రోన్‌లు అందే అవకాశం. డజన్ల కొద్దీ కొత్త "ఫీనిక్స్ ఘోస్ట్" డ్రోన్‌ల తయారీ, షిప్పింగ్‌ను పెంటగాన్ ట్రాక్ చేసిందిన.


మునిగిపోయిన రష్యా మోస్క్వా షిప్..

రష్యా నౌక మోస్క్వా మునిగిపోవడానికి కారణం బైరక్టార్ TB-2 డ్రోన్. నౌకను రెండు నెప్ట్యూన్ మిసైల్స్‌ ఢీకొన్నాయని ఉక్రెయిన్ చెప్పగా, దాడిలో TB-2 కీలక పాత్ర పోషించిందని నివేదికలు సూచిస్తున్నాయి. మానవరహిత వైమానిక వాహనాలను (UAV) గుర్తించే సామర్థ్యం మోస్క్వా రాడార్ వ్యవస్థలో లేదంటున్నారు నిపుణులు. అందువల్ల బైరక్టార్ TB2 డ్రోన్‌ను ఓడ గుర్తించలేకపోయిందని సమాచారం. ఉక్రేనియన్ యాంటీ షిప్ మిసైల్స్‌ తెరిచినప్పుడు డ్రోన్‌లు దృష్టి మరల్చి కూడా ఉండవచ్చని విశ్లేషణ. మోస్క్వా మునిగిపోవడంతో ఉక్రెయిన్‌ యుద్ధంలో తన వ్యూహాన్ని పునరాలోచించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది రష్యా. రష్యా సైన్యం చేస్తున్న ఇతర ఏకకాల కార్యకలాపాలకు మోస్క్వా రక్షణ కల్పించింది. మోస్క్వా మునిగిపోవడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కోపం తెప్పించిందని, మాస్కో, అంకారా మధ్య సంబంధాలు మరింత ఒత్తిడికి గురవుతాయని నివేదికలు చెబుతున్నాయి.

First published:

Tags: China, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు