Home /News /international /

ఈ చిన్న గిన్నె.. డాలర్ల వర్షం కురిపిస్తోంది.. అతడిని కోటీశ్వరుడిని చేసింది..

ఈ చిన్న గిన్నె.. డాలర్ల వర్షం కురిపిస్తోంది.. అతడిని కోటీశ్వరుడిని చేసింది..

చైనీస్ గిన్నె (Image:Sotheby's)

చైనీస్ గిన్నె (Image:Sotheby's)

అసలు ఈ గిన్నెను ఎవరు అమ్మారు, ఎవరు దీన్ని ఇంత విలువైన, అరుదైన వస్తువుగా గుర్తించారు.. అసలు తెరవెనుక ఏం జరిగిందన్న విషయం ఆక్షన్ హౌస్‌కు కూడా అంతుచిక్కటం లేదు. ఇదంతా మిస్టరీగా ఉందని కాకపోతే ఈ లోటస్ బౌల్ చాలా అరుదైన సంపదగా మాత్రం కచ్ఛితంగా గుర్తించినట్టు వివరిస్తున్నారు.

ఇంకా చదవండి ...
మీరు ఇష్టపడి సాధారణ ధరకే కొన్న వస్తువుకు వేలాది డాలర్ల విలువ ఉందని తెలిస్తే! ఎంత ఆనందంగా ఉంటుందో కదా.. అక్షరాలా ఇదే జరిగింది ఓ వ్యక్తికి. ఏదో మార్కెట్లోకి అలా వెళ్లిన అతనికి మంచి పింగాణీ కప్పు ఒకటి తెగ నచ్చింది.. అంతే దాని ధర మాత్రం 35 డాలర్లు (రూ.2,536) కావటంతో కాస్త అటు ఇటు ఆలోచించి చివరికి పెద్దగా బేరం ఆడకుండానే దాన్ని కొనేశాడు. ఆతరువాత ఈ బౌల్ ఫొటోలను ఆక్షన్ స్పెషలిస్టులకు పంపాడు. దీని ధర సుమారు 500,000 డాలర్లు (రూ.3,62,32,250.00) తెలియడంతో ఆశ్చర్యపోవడం అతడి వంతైంది. అయితే ఆ వ్యక్తి తన వివరాలను మాత్రం చెప్పద్దని ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ అయిన సోత్బే ఆక్షన్ హౌస్‌కు విన్నవించుకున్నాడట.

న్యూయార్క్ లోని సోత్బే ఆక్షన్ హౌస్ అత్యంత అరుదైన వస్తువులను సేకరించి, అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువను లెక్కగట్టి వేలం వేస్తుంది. ఇలా వచ్చే నెలలో జరుగనున్న వేలం పాటలో ఈ అరుదైన పార్సలిన్ బౌల్ ను వేలానికి పెడుతుండటం సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ బౌల్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే ఇది చాలా సింపుల్ గా కనిపించే అత్యంత అరుదైన గిన్నె కాగా.. తెల్లని పాలరాతి లాంటి పింగాణీ గిన్నె నిగనిగలాడుతూ, దానిపై ముదురు నీలం రంగులో తీగలు, కమలం పూలు, చామంతి పూలు, దానిమ్మ మొగ్గలు వంటి అందమైన డిజైన్లు కళ్లు చెదిరేలా కనిపిస్తాయి. ఈ బుజ్జి గిన్నెను చూస్తే పాలరాతిపై చెక్కిన అందమైన శిల్పంలా ఉంటుంది. దీనిపై సుతారమైన మోటిఫ్‌లు కనిపిస్తాయి. చైనాలోని మింగ్ డైనాస్టీలో దీన్ని తయారు చేసినట్టు ధృవీకరించారు.

లోటస్ బౌల్:
ఈ కళాఖండాన్ని 1403-1424 మధ్య తయారు చేసి ఉండచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే మింగ్ రాజకుటుంబం పార్సలిన్ వస్తువులను నాజుకుగా తయారు చేయటాన్ని ఎంతో ప్రోత్సహించి అత్యద్భుతమైన పనితనం ఉన్న ఎన్నో వస్తువులను తయారు చేయించేదని చరిత్రకారులు గుర్తించారు. ప్రస్తుతం దీన్ని "లోటస్ బౌల్" గా పిలుస్తున్నారు. దీని ధర వేలం పాటలో కనీసం 300,000-500,000 డాలర్లు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే అతను కొన్నదానికంటే 14,300 రెట్లు ఎక్కువన్నమాట. సిల్కీగా ఉన్న ఈ గిన్నె.. గ్లాస్ లా తళతళలాడుతూ చూడముచ్చటగా ఉంది.

మిస్టరీగా మారింది:
అయితే అసలు ఈ గిన్నెను ఎవరు అమ్మారు, ఎవరు దీన్ని ఇంత విలువైన, అరుదైన వస్తువుగా గుర్తించారు.. అసలు తెరవెనుక ఏం జరిగిందన్న విషయం ఆక్షన్ హౌస్‌కు కూడా అంతుచిక్కటం లేదు. ఇదంతా మిస్టరీగా ఉందని కాకపోతే ఈ లోటస్ బౌల్ చాలా అరుదైన సంపదగా మాత్రం కచ్ఛితంగా గుర్తించినట్టు వివరిస్తున్నారు. 6 అంగుళాల డయామీటర్ ఉన్న ఈ బుల్లి బౌల్ సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి బౌల్స్ ప్రపంచంలో ఇప్పటి వరకు కేవలం 5 మాత్రమే గుర్తించినట్టు.. మింగ్ రాజకుటుంబం హయాంలో పెద్ద ఎత్తున తయారైన మిగతా పార్సలిన్ వస్తువులు ఏమైనట్టో తమకు అంతు చిక్కటం లేదని సోత్బే వివరిస్తోంది. వచ్చే నెల 17న జరుగనున్న "ఏషియా వీక్" లో భాగంగా దీన్ని వేలానికి పెట్టనున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: America, International news, Trending

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు