Man Being Dragged for Quarantine : దాదాపు 3 ఏళ్ల క్రితం చైనా(China) నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న కరోనా అనే ఓ వైరస్(Corona virus) ప్రపంచానికి పెను ముప్పుగా మారిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మరణించారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ వైరస్ బారిన పడినవే. అయితే కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఈ వ్యాధి నుండి విముక్తి పొందాయి, ప్రజలు తమ జీవితాలను సాధారణంగా గడపడం ప్రారంభించారు. అయితే ఈ వైరస్ మొదలైన చైనాలో ప్రస్తుతం కోవిడ్ మరోసారి విజృంభిస్తోంది.
వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో కోవిడ్ పాలసీపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక్క పాజిటివ్ కేసు బయటపడినా సదరు బిల్డింగ్ ను సీజ్ చేయడం, జనాలను ఇళ్లల్లోనే ఐసోలేట్ చేయడం, చుట్టుపక్కల ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించడం ,తదితర చర్యలు తీసుకుంటోంది. దీంతో ఆకలితో మాడుతున్నామని, చాలామంది తిండిలేక చనిపోయారని చైనా ప్రజలు చెబుతున్నారు. జోరీ కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా,అధ్యక్షుడు జిన్ పింగ్ రాజీనామా చేయాలంటూ ఇటీవల చైనాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. కాగా, జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా జనం చేస్తున్న ఆందోళనల వల్లే కేసులు పెరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా పెద్ద సంఖ్యలో జనం గుమికూడడం వల్లే దేశంలో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోందన్నారు.
Snowfall : సినిమాల్లో చూపించే మాదిరి హిమపాతం..దేశంలోని ఈ ప్రాంతాల్లో చూడవచ్చు
ఇదిలాఉండగా,తాజాగా చైనాలో, కరోనాతో బాధపడుతున్న ఓ వృద్ధుడు తన ఇంటి నుంచి క్వారంటైన్‌కు వెళ్లడానికి నిరాకరించడంతో అధికారులు అతన్ని లాగి తమతో తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. CNN న్యూస్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోలో...ఒక వ్యక్తి తన ఇంటి సోఫాపై కూర్చుని ఉండగా, ఇద్దరు పీపీఈ కిట్ ధరించిన అధికారులు అతన్ని అక్కడి నుండి బలవంతంగా తీసుకువెళుతున్నట్లు చూడవచ్చు. కరోనా వైరస్ నివారణ కోసం చైనాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు అతడిని తీసుకెళ్లాలనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తి అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా లేడు. ఆ వ్యక్తిని అధికారులు లాగిన వీడియో వైరల్ అవడంతో అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అయితే తమతో రావడానిక నిరాకరించిన వ్యక్తే తర్వాత తమకి క్షమాపణలు కూడా చెప్పాడని అధికారులు స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Corona virus, Covid -19 pandemic, Viral Video