30,000 ప్రపంచ మ్యాపుల్ని ధ్వంసం చేసిన చైనా.... అరుణాచల్ ప్రదేశ్, తైవాన్ చైనాలో లేకపోవడమే కారణం

China World Maps : చైనాతో సరిహద్దులకు సంబంధించి భారత్... 12 సార్లు సమావేశాలు నిర్వహించింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 26, 2019, 1:31 PM IST
30,000 ప్రపంచ మ్యాపుల్ని ధ్వంసం చేసిన చైనా.... అరుణాచల్ ప్రదేశ్, తైవాన్ చైనాలో లేకపోవడమే కారణం
ప్రపంచ పటం (Image :
  • Share this:
చైనాలోని కస్టమ్స్ అధికారులు... ఆ దేశంలో ప్రింటైన 30,000 ప్రపంచ మ్యాపుల్ని నాశనం చేశారు. ఆ మ్యాపుల్లో ఎక్కడా కూడా అరుణాచల్ ప్రదేశ్, తైవాన్... చైనా అధీనంలో ఉన్నట్లు లేకపోవడమే అసలు కారణం. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా చెప్పుకొస్తోంది. చైనా అధీనంలో ఉన్న దక్షిణ టిబెట్‌లో అది భాగమని అంటోంది. ఎప్పుడైనా భారత సైనికులు అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే చాలు... తమ భూభాగంలోకి వచ్చేస్తున్నారని హడావుడి చేస్తోంది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్ తనదేనని అనుకునేలా నాటకాలాడుతోంది. భారత్ మాత్రం... అరుణాచల్ ప్రదేశ్... మన దేశంలో భాగమనీ, అక్కడకు భారతీయులెవరైనా ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా వెళ్లొచ్చని స్పష్టం చేస్తోంది.

ఈ సరిహద్దు సమస్యలపై రెండు దేశాలూ 21 సార్లు చర్చలు జరుపుకున్నాయి. రెండు దేశాల మధ్యా 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ ఉంది. దీనిపై రెండు దేశాల మధ్యా ఏకాభిప్రాయం లేదు. ద్వీప దేశం తైవాన్‌ కూడా తమదేనని అంటోంది చైనా. ఈ వాదనను తైవాన్ ప్రతిసారీ తిప్పికొడుతూనే ఉంది. చైనాలోని ఓ గుర్తింపులేని ప్రదేశానికి ఆ 30,000 మ్యాపులూ వెళ్లాల్సి ఉంది. క్వింగ్‌డావ్‌లోని కస్టమ్స్ అధికారులు వాటిని అడ్డుకున్నారు. అవి సరిగా లేవనీ, తైవాన్‌ను ప్రత్యేక దేశంగా చూపిస్తున్నాయనీ, భారత్‌తో సరిహద్దులు తప్పుగా ఉన్నాయనీ అధికారులు వంక పెట్టారు. అన్నింటినీ తగలబెట్టేశారు.


చైనా చేస్తున్న ఇలాంటి చర్యలు... రెండు దేశాల మధ్యా శాంతి ప్రక్రియకు భంగం కలిగిస్తున్నాయి. చైనాకు ఒక్క అంగుళం కూడా వదిలేది లేదంటున్న కేంద్ర ప్రభుత్వం... ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునేందుకు, చైనాతో పోరాడేందుకు... ఈశాన్య సరిహద్దుల్లో భారీ ఎత్తున భద్రతా దళాల్ని మోహరించి... అనుక్షణం పర్యవేక్షిస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

స్లీపింగ్ సిండ్రోమ్... కంటిన్యూగా 3 వారాలు నిద్రపోయింది... ఎగ్జామ్స్‌ మిస్సైంది...

వైసీపీ మేనిఫెస్టోపై జగన్ దృష్టి... టీడీపీకి దెబ్బకొట్టేలా ఉండబోతోందా?ఆ పార్టీలో అందరూ మహిళలే... దేశంలోనే మొదటిది... ముంబైలో ప్రారంభం

ఆ బాలికల్ని వాళ్ల కుటుంబాలకు అప్పగించాల్సిందే... పాకిస్థాన్ ప్రధానికి సుష్మాస్వరాజ్ వార్నింగ్
First published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading