అమెరికా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. చైనా స్పై బెలూన్‌లు అమెరికా గగనతలంలో చక్కర్లు కొట్టడం... దాన్ని అమెరికా పేల్చివేయడం..ఈ పరిణామాన్ని ఊహించని చైనా అగ్గిమీద గుగ్గిలమవడం చకచకా జరిగిపోయాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే ముందు ముందు ఏం జరుగుతుందోనన్న భయాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. జరుగుతున్న పరిణామాలని వివిధ దేశాధినేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పకముందే ఇరు దేశాలు శాంతంగా మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. ఇటు తమ బెలూన్‌ను అమెరికా పేల్చివేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Chinese Spy Baloon .... fooooss... pic.twitter.com/mwp6VqxkMP
— PANKAJ CHOUDHARY (@PANCHOBH) February 5, 2023
చైనా బెలూన్‌ను పేల్చేసిన అమెరికా:
చైనా స్పై బెలూన్‌ను అమెరికా ఎట్టకేలకు కూల్చేసింది. అమెరికా గగనతలంలో ఎగురుతూ మిలటరీ స్థావరాలపై ఈ బెలూన్ నిఘా పెట్టినట్లు భావించింది. అయితే ముందుగానే దీన్ని పేల్చివేయాలని చూసినప్పటికీ ప్రజల క్షేమం దృష్ట్యా ఆ నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టింది. బెలూన్‌ను పేల్చివేస్తే దాని ద్వారా చెలరేగే మంటలు, బెలూన్ శిధిలాల వల్ల మాంటానాలోని ప్రజలకు హాని వాటిల్లే ప్రమాదముందని ఆ నిర్ణయాన్ని నిన్న తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే చైనీస్ స్పై బెలూన్ మోంటానా ప్రాంతం నుంచి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఎగిరిన వెంటనే.. అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు దానిని పేల్చివేశారు. ఆ సమయంలో సమీపంలోని మూడు విమానాశ్రయాలను , గగనతలాన్ని మూసివేశారు. ఎఫ్-22 యుద్ధ విమానాన్ని ఉపయోగించి బెలూన్‌ను పేల్చివేశారు. దక్షిణ కాలిఫోర్నియా మర్టల్ బీచ్ ప్రాంతంలో ఆ బెలూన్ శకలాలు పడ్డాయి. వాటిని సేకరించేందుకు మిలటరీ సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Chinese Spy Baloon shot down by US Army. pic.twitter.com/OQsz4YxOLH
— PANKAJ CHOUDHARY (@PANCHOBH) February 5, 2023
చూస్తూ ఊరుకోబోం: చైనా
తమ బెలూన్‌ను కూల్చివేయడంపై డ్రాగన్ ఘాటుగా స్పందించింది. అమెరికా చర్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్ తంచేసింది. ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చైనా వాదిస్తోంది. అగ్రరాజ్యం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్ర ఉల్లంఘనేనని ఆరోపించింది. నిజానికి తమ బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ఎంట్రీ ఇచ్చిందని.. ఈ విషయాన్ని బైడెన్ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని డ్రాగన్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అయితే చైనా మాటలను నమ్మని అమెరికా అనుకున్న పని చేసేసింది. టైమ్ చూసి చైనా బెలూన్‌ను పేల్చేసింది. ఇది చైనాకు తీవ్ర కోపం తెప్పించింది. ధీటుగా బదులిస్తామన్న రేంజ్‌లో చైనా స్పందించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.