Home /News /international /

CHINAS MASSIVE MISSILE ATTACKS FOR TAIWANS INVASION TAIWANS RESPONSE WITH US FORCES UMG GH

China- Taiwan Conflict: తైవాన్ ఆక్రమణకు చైనా భారీగా మిసైల్ దాడులు.. యూఎస్ ఆయుధాలతో తైవాన్ దీటైన సమాధానం

 తైవాన్ ఆక్రమణకు చైనా భారీగా మిసైల్ దాడులు.. యూఎస్ ఆయుధాలతో తైవాన్ దీటైన సమాధానం ..

తైవాన్ ఆక్రమణకు చైనా భారీగా మిసైల్ దాడులు.. యూఎస్ ఆయుధాలతో తైవాన్ దీటైన సమాధానం ..

ఉక్రెయిన్(UKRAINE)- రష్యా(Russia)ల మధ్య యుద్ధం ముగియకముందే మరో రెండు దేశాల యుద్ధానికి సిద్ధం అవువతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం అమెరికా(America) అని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తైవాన్(Taiwan) ఎప్పటికీ మా భూభాగమే అని చైనా(China) వాదిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఉక్రెయిన్(UKRAINE)- రష్యా(Russia)ల మధ్య యుద్ధం ముగియకముందే మరో రెండు దేశాల యుద్ధానికి సిద్ధం అవుతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం అమెరికా(America) అని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తైవాన్(Taiwan) ఎప్పటికీ మా భూభాగమే అని చైనా(China) వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా చట్టసభల ప్రతినిధి నాన్సీ పేలోసీ తైవాన్ లో పర్యటించడం చైనాకు కోపం తెప్పించింది. ముందుగానే చైనా హెచ్చరికలు జారీ చేసినా అమెరికా పెడచెవిన పెట్టింది. ఇప్పుడు ఇదే అ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. ఈక్రమంలోనే చైనా బాలిస్టిక్ క్షిపణులతో తైవాన్ సముద్ర జలాల్లో జారవిడిచింది. మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్‌ను ప్రదర్శిస్తూ తైవాన్ ను భయపెడుతోంది. తైవాన్ చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతాలు, ఆకాశంలో ఎయిర్‌క్రాఫ్ట్స్‌, వార్‌షిప్స్‌తో మిలిటరీ డ్రిల్స్‌ప్రదర్శిస్తూ కయ్యానికి కాలుదువ్వడానికి సిద్ధం అవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చైనా- తైవాన్ వివాదం హిమార్స్ బ్యాటిల్‌అవుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో సోషల్‌మీడియాలో చైనీస్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్(MLRS) ఇమేజ్‌ప్రత్యక్షమైంది. దీన్ని యూఎస్‌మేడ్‌హిమార్స్‌కు చైనా వెర్షన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది తైవాన్‌వివాదంలో 'గేమ్ ఛేంజర్' కావచ్చని విశ్లేషణ.

చైనీస్ హిమార్స్
సోషల్‌మీడియాలో కనిపించిన ఇమేజెస్‌ను చైనీస్ టెలివిజన్ ఛానెల్ CCTV-7 నుంచి అమెరికా సేకరించినట్లు సమాచారం. ఇమేజెస్‌లో కనిపించిన MLRS సిస్టమ్‌లు వీషి (గార్డియన్‌) వర్గానికి చెందినవిగా నివేదికలు బయట పెట్టారు. చెందిన వీషి(WS) వర్గానికి MLRSలో మల్టిపుల్‌డెవలపర్స్‌చేసిన వేరియంట్స్‌ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

WS-1
విదేశీ వినియోగదారులు లక్ష్యంగా WS-1 మరింత అభివృద్ధి చేసి, 180 కిమీల మెరుగైన రేంజ్‌తో WS-1B వేరియంట్‌ తయారీ 302 mm రాకెట్ సిస్టమ్‌ను తయారు చేశారని నిపుణులు పేర్కొన్నారు. అయితే PLAను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. WS-1B కాకుండా, 122 mm WS-1E కూడా ఉందని, ప్రొడక్షన్‌లోకి ఎంటర్‌ కాలేదని నివేదికలు గుర్తించాయి.

WS-2
WS-2D వేరియంట్‌లో ప్రత్యేకమైన యాంటీ-రాడార్ వెర్షన్‌సహా సబ్‌మ్యూనిషన్స్‌, ఇది మూడు UAVలను ఈ రాకెట్ కలిగి ఉంది. దీని రేంజ్‌70 నుంచి 200 కి.మీ. గైడెడ్‌బై సింపుల్‌ ఇనెర్షియల్‌ గౌడెన్స్‌సిస్టమ్‌, జీపీఎస్‌ గైడెన్స్‌ ఉన్న WS-2C & 2D వేరియంట్‌లకు, వరుసగా 350, 400 కిమీ రేంజ్‌ వరకు ఉంటుంది. దీనిని రాకెట్‌లలో వివిధ రేంజ్‌ల వార్‌హెడ్స్‌, బ్లాస్ట్ ఫ్రాగ్మెంటేషన్, యాంటీ పర్సనల్ & ఆర్మర్-పియర్సింగ్ డ్యుయల్‌పర్పస్‌వినియోగించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ అంచనా వేస్తున్నారు.

WS-3
ఈ మిసైల్ 400 మి.మీ హై ప్రెసిషన్ గైడెడ్ MLRS ఉండి, GPS/INS ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సిస్టమ్ తో పనిచేస్తుంది. 300 మీటర్ల సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ(CEP), కంట్రోల్‌సిస్టమ్‌లో నావిగేషన్ కంట్రోలర్, GNSS యాంటెన్నా, లో నాయిస్ యాంప్లిఫైయర్, యాక్యుయేటర్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ బ్యాటరీ, పవర్ డిస్ట్రిబ్యూటర్, ఆన్‌బోర్డ్ కేబుల్, ఫ్లైట్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్ ఉంటాయని నివేదికలో స్పష్టం చేసింది.

తైవాన్ హిమార్స్
11 M142 HIMARS, సంబంధిత ఆయుధాలను తైవాన్‌కు విక్రయించడానికి 2020లో యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారం ఇచ్చింది. ఉక్రెయిన్‌లో హిమార్స్ విజయవంతం కావడంతో ఎక్కువ హిమార్స్‌లను కొనుగోలు చేయడానికి తైవానీస్ రక్షణ అధికారులు ముందుకు వచ్చారు. హిమార్స్‌ అనేది తేలికపాటి ట్రక్కు-మౌంటెడ్ మల్టిపుల్‌ రాకెట్ లాంచర్. దీనిని యూఎస్‌ ఆయుధ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేశాడు.

హిమార్స్ ఫీచర్‌లు
దీని పరిధి - 500 కిమీ వరకు లక్ష్యాన్ని చేధించగలదు. ట్రక్ ఫ్రేమ్ బరువు - 5 టన్నులు, అందుబాటులో గైడెడ్ మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ పాడ్‌ ఉంటుంది. రెండు ప్రెసిషన్ స్ట్రైక్ మిస్సైల్స్‌ను, ఆరు 227 ఎంఎం గైడెడ్ మిసైల్స్‌ను పేల్చే శక్తి దీని సొంతం. MGM-140 ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్‌ను ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉండి.

ఇదీ చదవండి: Tallest Flag Pole: దేశంలోనే ఎత్తైన జెండా .. ఎక్కడో తెలుసా ! దీని ప్రత్యేకతలు చదివితే సెల్యూట్ చేస్తారు..!


చైనా-తైవాన్ వివాదం హిమార్స్ యుద్ధం అవుతుందా?
తైవాన్‌పై చైనా దాడిలో వీషీ సిరీస్ MLRS కీలక పాత్ర పోషిస్తుందని PLA, చైనా వ్యవహారాల నిపుణుడు ఆదిల్ బ్రార్ తెలిపాడు. వీషీ సిస్టమ్‌ తైవాన్ పరిస్థితులకు సరిపోతుందని, తక్కువ దూరంలోని లక్ష్యాలను కచ్చితమైన సామర్థ్యంతో ఛేదిస్తుందన్నారు. చైనా తన కొత్త PHL-16 మల్టిపుల్‌ లాంచింగ్‌రాకెట్ సిస్టమ్‌ను గరిష్టంగా 500 కి.మీ. ప్రయోగించగలదని నిపుణులు చెప్తున్నారు.

తైవాన్‌లో హిమార్స్ ఎందుకు ప్రాణాంతకం అవుతుంది ?
సైనిక చర్యలకు తైవాన్ ఇరుకైన ప్రాంతమని,విస్తారమైన తూర్పు యూరోపియన్ మైదానానికి భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చైనా తైవాన్‌పై దాడి చేస్తే, మొట్టమొదట భూమి, సముద్రం రెండింటిపై హిమార్స్ ను ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తైవాన్ సైన్యం వద్ద తగిన సంఖ్యలో హిమార్స్‌ ఉంటే చైనీస్ మిలిటరీని నిరోధించే అవకాశం ఉంది.ఉక్రెయిన్ యుద్ధంలో విజయవంతమైన హిమార్స్!
జూన్ చివరిలో ఉక్రెయిన్‌ సైన్యానికి మొదటి ఎనిమిది హిమార్స్‌ సిస్టమ్‌లను అమెరికా అందించింది. అప్పటి నుంచి చాలా రష్యన్‌ టార్గెట్‌లను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసిందని నిపుణులు చెప్పారు. జులై 11న ఖేర్సన్ సమీపంలోని రష్యా మందుగుండు సామగ్రి డిపోను యూఎస్‌ మేడ్‌ హిమార్స్‌తో ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. HIMARS అత్యుత్తమ పనితీరు కారణంగా.. ఉక్రెయిన్‌కు నాలుగు అదనపు సిస్టమ్‌లను పంపడానికి యూఎస్‌ అంగీకరించింది. ఏది ఏమైనా తైవాన్ లో అమెరికా పర్యటన ఇరు దేశాల మధ్య మరో చిచ్చుకు కారణం అయింది.
Published by:Mahesh
First published:

Tags: America, China, Russia-Ukraine War, Taiwan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు