2020 నాటికి కృత్రిమ సూర్యుడిని సృష్టించనున్న చైనా...

(Image: Xinhua)

హెచ్‌ఎల్‌-2ఎం టోకామాక్‌ పేరుతో ఈప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు శాస్ర్తవేత్తలు ప్రకటించారు. అయితే ఈ నమూనా సూర్యుడిలో అసలైన సౌరతలంపై సహజంగా జరిగే ప్రక్రియల లాగానే పని చేస్తుందంటున్నారు.

  • Share this:
    కృత్రిమ సూర్యుడిని అభివృద్ధి చేస్తున్నట్లు చైనా సైంటిస్టులు ప్రకటించారు. దీనిని 2020లో అందుబాటులోకి తెస్తామంటున్నారు. హెచ్‌ఎల్‌-2ఎం టోకామాక్‌ పేరుతో ఈప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు శాస్ర్తవేత్తలు ప్రకటించారు. అయితే ఈ నమూనా సూర్యుడిలో అసలైన సౌరతలంపై సహజంగా జరిగే ప్రక్రియల లాగానే పని చేస్తుందంటున్నారు. సూర్యుడిలో జరిగే న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ ప్రక్రియను కృత్రిమంగా జరిపించడం ద్వారా సూర్యుడి కన్నా పది రెట్లు అంటే 10 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత శుద్ధమైన శక్తిని విడుదలయ్యేలా చేస్తారు. సాధారణ సూర్యుడు, నక్షత్రాలు నియంత్రిత అణు విచ్చిత్తి ద్వారా అనంతమైన శక్తిని అందించనుంది. హెచ్‌ఎల్‌-2ఎం టోకామాక్‌ హైడ్రోజన్‌, డ్యూటేరియం వాయు ఇంధనాలను అణు సంలీనం చేస్తుందని చెబుతున్నారు. అణు విచ్చిత్తి ప్రక్రియ ప్రతిబింబించేందుకు నూ-2వీ టోకామాక్‌ పరికరాన్ని చైనా తయారు చేస్తున్నది. దీనినే కృతిమ సూర్యుడిగా పిలుస్తున్నారు. ఆకాశంలో సూర్యుడు కదలికలు ఉండే మాదిరిగానే చైనా సూర్యుడు రెడీ అవుతున్నాడు.
    Published by:Krishna Adithya
    First published: