చైనాలో భారీగా తగ్గిపోతున్న పిల్లల జనాభా...పెరిగిపోతున్న వృద్ధులు

జనాభాలో 18.1 శాతం మంది 60 ఏళ్లు దాటిన వారు ఉండడంతో పనిచేసే జనాభా బాగా తగ్గిపోయింది. అయితే కొత్త జనాభా లెక్కల ప్రకారం చైనా జనాభా 140.05 కోట్లకు చేరుకుంది. 2019లో మ 14.65 మిలియన్ బిడ్డలు పుట్టారు.

news18-telugu
Updated: January 18, 2020, 10:31 PM IST
చైనాలో భారీగా తగ్గిపోతున్న పిల్లల జనాభా...పెరిగిపోతున్న వృద్ధులు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
చైనాలో జననాల రేటు భారీ స్థాయిలో తగ్గిపోయింది. చైనా ఆవిర్భావం జనాభా పెరుగుదల రేటు ఇంతలాగా పడిపోవడం ఇదే మొదటిసారి కావడంతో ఆందోళన ప్రారంభమైంది. ఇంతకాలం అధిక జనాభా సమస్యను ఎదుర్కొన్న చైనా, ఇప్పుడు పడిపోతున్న జననాల రేటుతో కొత్త సమస్యను ఎదుర్కోనుంది. ముఖ్యంగా దేశంలో వృద్ధుల పెరుగుదల, లేబర్ శక్తి తగ్గిపోవడం సంక్షోభానికి దారితీస్తుందేమో అనే ఆందోళన నెలకొంది. ఇప్పటికే 2016లో చైనా ప్రభుత్వం సింగిల్ బేబీ నినాదం సడలించారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని కలిగి ఉండేందుకు అనుమతిచ్చింది. అయినప్పటికీ జననాల రేటు పెంచేందుకు ఇది దోహద పడటంలేదు. 2019లో వెయ్యి మందికి 10.48 జననాల స్థాయికి పతనమైంది. అయితే శుక్రవారం విడుదలైన జాతీయ గణాంకాల సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎన్‌బిఎస్) విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

వరసగా మూడేళ్లుగా జననాల రేటు పతనమవుతోంది. జనాభాలో 18.1 శాతం మంది 60 ఏళ్లు దాటిన వారు ఉండడంతో పనిచేసే జనాభా బాగా తగ్గిపోయింది. అయితే కొత్త జనాభా లెక్కల ప్రకారం చైనా జనాభా 140.05 కోట్లకు చేరుకుంది. 2019లో మ 14.65 మిలియన్ బిడ్డలు పుట్టారు.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు