షాకింగ్.. మహిళ బ్రైన్‌లో రెండు సూదులు.. పొడవు 4.9 మిల్లిమీటర్లు

చిన్నపాటి రోడ్డ ప్రమాదం అనంతరం చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ వార్త తెలిసింది. ఆస్పత్రిలో తీయించుకున్న సీటీ స్కాన్‌లో తన మెదడులో రెండు సూదులు ఉన్నట్టు తేలింది

news18-telugu
Updated: September 26, 2020, 4:08 PM IST
షాకింగ్.. మహిళ బ్రైన్‌లో రెండు సూదులు.. పొడవు 4.9 మిల్లిమీటర్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిన్నపాటి రోడ్డ ప్రమాదం అనంతరం చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ వార్త తెలిసింది. ఆస్పత్రిలో తీయించుకున్న సీటీ స్కాన్‌లో తన మెదడులో రెండు సూదులు ఉన్నట్టు తేలింది. దీంతో కంగుతినడం ఆమె వంతైంది. ఈ ఘటన చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌జౌలో చోటు చేసుకుంది. జూహు అనే మహిళ ఇటీవల చిన్నపాటి కారు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆమె సీటీ స్కాన్ చేయించుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆమె‌కు ఎటువంటి గాయలు కాకపోయినప్పటికీ.. మెదడులో రెండు సూదులు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. రెండు సూదులు పొడవు దాదాపు 4.9 మిల్లీమీటర్లు ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఆ సూదులు ఆమె తలలోకి ఎలా వెళ్లి ఉంటాయనేది ఇప్పుడు అర్థం కానీ ప్రశ్నగా మారింది.

మరోవైపు తన తలకు సంబంధించి ఎప్పుడు శస్త్ర చికిత్స జరగలేదని జూహు తెలిపింది.ఇది తనకే చాలా వింతగా ఉందని వెల్లడించింది. తనుకు ఎప్పుడూ అనారోగ్యం కలగలేదని చెప్పింది. తలనొప్పి కూడా లేదని పేర్కొంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి వైద్యులు మాట్లాడుతూ.. జూహు చిన్నతనంలో ఉద్దేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ సూదులు ఆమె తలలోకి చొచ్చుకుని ఉండి ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. మెదడులో సూదులు ఉండటం ప్రమాదకరమని, వాటిని వెంటనే తొలగించాలని వైద్యులు చెప్పారు. మెదడులోని ముఖ్యమైన భాగంలో కాకుండా.. వేరే ఇతరప్రాంతాల్లో సూదులు ఫిక్స్ అయ్యాయని.. అవి కూడా చాలా సన్నగా ఉన్నాయని.. అందువల్ల దాని ప్రభావం ఆమెకు తెలియలేదనిఅన్నారు.

జూహు తలలోకి సూదులు ఎలా వెళ్లాయనేది తమకు తెలీదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. చిన్నప్పటి నుంచి ఆమె ఆరోగ్యంగానే ఉందన్నారు. అయితే, తాము టూర్ వెళ్లినప్పుడు జూహును వాళ్ల అంటీ ఇంట్లో ఉంచామని.. అప్పుడు ఆమె జూహు తలపై రెండు నల్లని గుర్తులు చూసినట్టు చెప్పిందని తెలిపారు. అయితే అవి సాధారణ మచ్చలు కావచ్చని తాము పట్టించుకోలేదన్నారు. ఇక, తన తలలో సూదులు ఉండటంపై జుహు పోలీసులను ఆశ్రయించింది. సిటీ స్కాన్ రిపోర్టు‌ను పోలీసులకు అందజేసిన జూహు.. అవి తన తలలోకి ఎలా వెళ్లాయో తెలుసుకోవడానికి విచారణ జరపాలని కోరింది. ఇక, కొద్ది రోజుల కిందట చైనా వైద్యులు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న మహిళ మెదడు నుంచి ఆరు ఇంచుల బతికున్న పురుగును బయటకు తీశారు. పూర్తిన ఉడకని లేదా, పచ్చి మాంసం తినడం వల్ల ఆమెతలలోకి పురుగు వెళ్లినట్టుగా గుర్తించారు.
Published by: Sumanth Kanukula
First published: September 26, 2020, 4:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading