Home /News /international /

CHINA TO DEPLOY EXACT REPLICA OF RUSSIAS POWERFUL MISSILES DEFENSE SYSTEM NEAR INDIAN BORDER GH VB

HQ-17 Missile: ఆర్మీ ఆధునీకరణలో చైనా దూకుడు.. మిలిటరీ వ్యవస్థలోకి సరికొత్త మిస్సైల్.. అది ఎలా పనిచేస్తుందంటే..

HQ 17 (Image : Wiki)

HQ 17 (Image : Wiki)

ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తోన్న అమెరికాను ఢీకొట్టేందుకు, తన రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం చేసుకునేందుకు చైనా మరో అడుగు ముందుకు వేసింది. చైనా ఇటీవల చేపట్టిన పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (PLA) ఆధునీకరణలో భాగంగా పెద్ద ఎత్తున అణ్వాయుధాలను చేర్చుకుంటోంది.

ఇంకా చదవండి ...
ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తోన్న అమెరికా(America)ను ఢీకొట్టేందుకు, తన రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం చేసుకునేందుకు చైనా(China) మరో అడుగు ముందుకు వేసింది. చైనా ఇటీవల చేపట్టిన పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (PLA) ఆధునీకరణలో భాగంగా పెద్ద ఎత్తున అణ్వాయుధాలను చేర్చుకుంటోంది. తాజాగా రష్యా(Russia) 'రిప్-ఆఫ్' మిస్సైల్ సిస్టమ్‌ను చైనా తన మిలిటరీలో చేర్చింది. చైనా జిన్​జియాంగ్ మిలిటరీ కమాండ్ ఈ కొత్త క్షిపణి వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చింది.

పీఎల్​ఏ ఆధునీకరణలో భాగంగా చైనా దూకుడు..
చైనా జిన్​జియాంగ్​ మిలటరీ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా HQ-17 క్షిపణితో సహా ఫిరంగి, బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థలను తన మిలిటరీలో చేర్చింది అక్కడి ప్రభుత్వం. చైనాకు సంబంధించిన జింజియాంగ్ మిలిటరీ కమాండర్ నిర్వహణలో ఇది ఒక భాగం కానుంది. చైనా- భారత్​ల మధ్య ఉన్న 3,487 కిలోమీటర్ల వివాదాస్పద సరిహద్దును పరిరక్షించుకోవడంలో భాగంగా రెండు దేశాల మిలిటరీలు గత 19 ఏళ్లుగా సరిహద్దుల్లో రక్షణ బలగాలను మోహరిస్తున్నాయి. ఈ క్రమంలో తమ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం చేసుకునేందుకు చైనా మరో అడుగు ముందుకు వేసింది.

International Flight Ban: ఫిబ్రవరి 28 దాకా అంతర్జాతీయ ప్రయాణాల్లేవు : నిషేధం పొడిగించిన భారత్


ఒక విధంగా చెప్పాలంటే గత సంవత్సరమే సాయుధ వాహనాలు, స్వీయ చోదక హోవిట్టర్ లు, బహుళ రాకెట్ లాంచర్లు, విమాన విధ్వంసక ఆయుధాలను జింజియాంగ్ మిలటరీ కమాండ్ తన రక్షణ వ్యవస్థలో చేర్చింది. అయితే ప్రస్తుతం పీఎల్​ఏ (పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ) ఆధునీకరణలో ఉంది చైనా ప్రభుత్వం. ఆధునీకరణలో భాగంగా కొత్తగా 3 లక్షల మంది ప్రతిభావంతులైన యువకులను సైన్యంలో చేర్చుకోవడమే కాకుండా అధునాతన మిస్సైల్స్​ను రక్షణ వ్యవస్థలోకి తీసుకురానున్నట్లు చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ గతేడాది ప్రకటించారు.

ఈ ప్రక్రియలో భాగంగానే సరిహద్దును రక్షించడానికి అనేక అధునాతన పరికరాలు అందుబాటులోకి తెచ్చినట్లు చైనా సైనిక విశ్లేషకుడు వివరించారు. ఈ జిన్‌జియాంగ్ మిలిటరీ కమాండ్ వ్యవస్థ కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్​, పాకిస్థాన్‌లతో ఉన్న సరిహద్దులపై నిఘా ఉంచింది.

HQ-17 మిస్సైల్​ ప్రత్యేకత ఏంటి..?
HQ 17 అనేది ఉపరితలం నుంచి గగనతలంపై చేసే దాడులకు ఉపయోగించే క్షిపణి. ఈ క్షిపణి వ్యవస్థ అప్‌గ్రేడ్ చేసిన ఎలక్ట్రానిక్స్, కొత్త ఆల్-టెర్రైన్ లాంచర్, ఇతర సిస్టమ్‌లతో డేటా-లింక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ‘‘ఎయిర్‌క్రాఫ్ట్ హంటర్" గా కూడా ఈ వ్యవస్థను పిలుస్తున్నారు. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (CASIC) దీన్ని అభివృద్ధి చేసింది.

చైనా హెచ్‌క్యూ-17 మిస్సైల్​ను రష్యన్ మిస్సైల్ సిస్టమ్ రిప్-ఆఫ్​గా పేర్కొంటున్నారు నిపుణులు. అంటే, మొదట Tor-M1 అనుమతుల కోసం ప్రయత్నించి తిరస్కరణకు గురైన చైనా.. రష్యా రక్షణ వ్యవస్థను రివర్స్ ఇంజనీరింగ్ చేసి HQ-17 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్​ను ఉత్పత్తి చేసింది.

అత్యాధునిక ప్రయోజనాలతో కూడిన ఈ క్షిపణిని బీజింగ్​లో జరిగిన జాతీయ దినోత్సవం సైనిక కవాతు సందర్భంగా 2019లో ప్రదర్శించింది. దాదాపు 125 కిలోల బరువు 2.9 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణి ఎగిరే వైమానిక లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి 15 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువులపై దాడి చేయగలదు. ఇది యాంటీ-రేడియేషన్ ఎయిర్-టు-గ్రౌండ్ క్షిపణులు, సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, క్రూయీస్ క్షిపణిలను కూడా కాల్చ గలిగే సామర్థ్యం కలిగి ఉంటుందని చైనా చెబుతోంది. ఈ వ్యవస్థ స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కూడా అడ్డగించగలదని చైనా పేర్కొంది. HQ-17AE వాహనం ఎనిమిది క్షిపణులను మోసుకెళ్లగలదని తెలిపింది. ఏకకాలంలో నాలుగు లక్ష్యాలను సాధించడం దీని ప్రత్యేకత.
Published by:Veera Babu
First published:

Tags: China, Missile

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు