చైనాలో మరో విమాన ప్రమాదం (China Flight Fire) జరిగింది. మార్చిలో జరిగిన విమాన ప్రమాదంలో 132 మంది మరణించిన ఘటనను మరవకముందే.. మరో విమానం మంటల్లో కాలిపోయింది. చైనాలోని చాంగ్‌కింగ్ జియాంగ్‌బీ ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం జరిగింది. 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' కథనం ప్రకారం.. గురువారం ఉదయం చాంగ్‌కింగ్ జియాంగ్‌బీ అంతర్జాతీయ విమానాశ్రయం (Chongqing Jiangbei International Airport)లో టిబెట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన TV9833 అనే విమానం అగ్నిప్రమాదానికి (Tibet Flight Catches Fire) గురయింది. ఈ విమానంలో 113 మంది ప్రయాణికులతో పాటు 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఫ్లైట్ చాంగ్‌కింగ్ నుంచి టిబెట్‌లోని న్యింగ్చికి వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయ్యేందుకు రన్‌వే నుంచి బయలుదేరిన కాసేపటికే ఓ విమాన రెక్క భాగం నుంచి మంటలు చెలరేగాయి. పైలట్లు అప్రమత్తమై వెంటనే విమానాన్ని నిలిపివేశారు. అనంతరం విమానంలో ఉన్న ప్రయాణికులను కిందికి దించేశారు.
విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతంలో నల్లటి పొమ్మ కమ్ముకుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
According to reports, at about 8:00 on May 12, a Tibet Airlines flight deviates from the runway and caught fire when it took off at Chongqing Jiangbei International Airport.#chongqing #airplane crash #fire pic.twitter.com/re3OeavOTA
— BST2022 (@baoshitie1) May 12, 2022
విమాన సిబ్బందితో పాటు ఎయిర్ పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించడంతో ముప్పు తప్పింది. లేదంటే ఘోరం జరిగి ఉండేది. మంటల కనిపించిన వెంటనే.. పైలట్లు విమానం నిలిపివేశారు. అనంతరం వెనక డోర్ నుంచి ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. అనంతరం ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 113 మంది ప్రయాణికులు, తొమ్మది మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని.. టిబెట్ ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించింది. ఐతే ఒకవేళ విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత.. ఆకాశంలో ఉన్న సమయంలో మంటలు చెలరేగి ఉంటే మాత్రం.. ఘోర ప్రమాదం జరిగి ఉండేది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది. ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
పెరుగుతున్న చైనా- రష్యా బెదిరింపులు.. మధ్య ఆసియా వ్యూహాలను రచిస్తున్న అమెరికా..
కాగా, చాంగ్ కింగ్ సిటీ ఉత్తర చైనాకు వారధి కావడంతో ఈ ఎయిర్ పోర్టు నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి చోట అనూహ్య ప్రమాదం జరగడం కలకలం రేపింది. ఇది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే 50 ఎయిర్ పోర్టుల్లో ఒకటి. ప్రపంచంలోని పెద్దనగరాల జాబితాలోనూ చాంగ్ కింగ్ సిటీ పేరుంటుంది. చైనాలో రాజధాని బీజింగ్, ఆర్థిక రాజధాని షాంఘై, ముఖ్యపట్టణం తియాంజిన్ తర్వాత కేంద్ర ప్రభుత్వమే నేరుగా పరిపాలన చేసే కేంద్ర పాలిత ప్రాంతం ఈ చాంగ్ కింగ్. ఇక టిబెట్‌ను చైనా పూర్తిగా వశంచేసకున్న తర్వాత చైనా నుంచి ఈ ప్రాంతానికి రాకపోకలు పెరిగాయి. వాస్తవానికి టిబెట్ ఎయిర్ లైన్స్ సంస్థ.. టిబెట్‌దే అయినప్పటికీ..చైనా ఆక్రమణ తర్వాత దాని నిర్వహణ మొత్తం బీజింగ్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
Sri Lanka Crisis: శ్రీలంకలో సైనిక తిరుగుబాటు? -రాజపక్సకు భారత్ ఆశ్రయం? -అసలేం జరుగుతోందం
చైనాలో మార్చిలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన బోయింగ్ - 737 విమానం గ్వాంగ్జి ప్రావిన్స్ వుజా నగర సమీపంలోని కొండల్లో కుప్పకూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 132 మంది మరణించారు. గాల్లో ఎగురుతన్న విమానం ఒక్కసారిగా కంట్రోల్ తప్పి.. అడవుల్లో కుప్పకూలింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విమానంలోని ప్రయాణికులంతా సజీవ దహనమయ్యారు. అనంతరం అడవులకు కూడా మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంపై చైనీస్ సంస్థల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Flight Accident, International, International news