Home /News /international /

CHINA SPREADING PROPAGANDA MADE FAKE VIDEO OF GALVAN VALLEY INDIAN ARMY DID NOT GIVE ANY PREFERENCE SOURCES SAID THERE IS NO FOOTAGE OF THE DISPUTED SITE GH VB

China Propaganda Video: గల్వాన్‌లోయపై చైనా ఫేక్ వీడియో గుట్టురట్టు.. ఆ వీడియో ఇదే..

గాల్వానా వీడియో

గాల్వానా వీడియో

బూటకాలమారి చైనా (China) ఎప్పటికప్పుడు తన కుత్సిత బుద్ధిని బయట పెట్టుకుంటోంది. అసత్య ప్రచారాలు, అబద్ధాలు వల్లించడంలో తనకు తానే సాటిగా నిత్యం నిరూపించుకుంటోంది.

బూటకాలమారి చైనా (China) ఎప్పటికప్పుడు తన కుత్సిత బుద్ధిని బయట పెట్టుకుంటోంది. అసత్య ప్రచారాలు, అబద్ధాలు వల్లించడంలో తనకు తానే సాటిగా నిత్యం నిరూపించుకుంటోంది. ఇప్పటికే ఎంతో అప్రదిష్ఠ మూటగట్టుకున్న డ్రాగన్ తాజాగా మరొకసారి పరువు పోగొట్టుకొని చింతిస్తోంది. జనవరి 1, 2022న గల్వాన్‌లోయ (Galwan Valley) పై చైనీస్ స్టేట్ మీడియా ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గల్వాన్‌లోయలో తన దేశ జెండాను ఆవిష్కరించి ఆ వ్యాలీని గుప్పిట పట్టినట్లు చైనా ఓ ప్రచార వీడియో (propaganda video) ని రిలీజ్ చేసింది. అయితే తాజాగా అక్కడి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘వీబో’ యూజర్లు ఆ వీడియో గుట్టురట్టు చేశారు. గల్వాన్‌లోయపై చైనా చేసిన ప్రచార వీడియో ఒక బూటకమని వీబో (Weibo) యూజర్లు బహిర్గతం చేశారు. దీనితో అవమానభారంతో తలెత్తుకోలేక పోతోంది చైనా ప్రభుత్వం.

చైనా గల్వాన్ వీడియోను ఒక నాటకంలా రూపొందించడానికి నటీనటులను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటపడటంతో సరిహద్దు ప్రాంతాలలో చైనా చేసిన వికృత చేష్టలను ఇండియా దుయ్యబట్టింది. గల్వాన్ వీడియోను అసత్యపు వీడియో అని కొందరు వీబో యూజర్లు బట్టబయలు చేశాక షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం అవమాన భారంతో కుంగిపోతున్నట్టు తెలుస్తోంది. జనవరి 1, 2022న గల్వాన్‌లోయపై వీడియోను చైనీస్ స్టేట్ మీడియా విడుదల చేసింది. ఆ వీడియోలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సిబ్బంది గల్వాన్‌లోయలో చైనా జెండాను ఆవిష్కరించినట్లు చైనీస్ స్టేట్ మీడియా పేర్కొంది. అయితే అది నిజం కాదని.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) జెండాను ఎగురవేసే ఒక నాటకాన్ని ప్రదర్శించిందని కొందరు వీబో యూజర్లు కుండబద్దలు కొట్టారు.

2022 Predictions: 2022లో ఏంజరుగుతుందో.. 20 ఏళ్ల క్రితమే ఊహించిన సీరియల్స్.. అవి ఏవంటే..


చైనా అబద్ధాలు బట్టబయలు
గల్వాన్‌లోయలో జెండా ఎగురవేసినట్లు వీడియోలో చైనా జర్నలిస్టులు ఆరోపించారు. కానీ అది నిజానికి గల్వాన్ నదికి 28 కిలోమీటర్ల వెనుక 4 గంటల పాటు షూటింగ్ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వీడియోలో గల్వాన్‌లోయలో తాము జెండా ఎగరేసినట్లు చైనా నొక్కి చెప్పింది కానీ అదంతా అబద్ధమేనని వీబో యూజర్లు తేల్చి చెప్పారు. అయితే ఈ వీడియో షూటింగ్ అనేది చైనీస్ నియంత్రణలో ఉన్న అక్సాయ్ చిన్ (Aksai Chin) ప్రాంతంలో జరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రచార వీడియోలో ప్రముఖ చైనీస్ నటుడు వు జంగ్, అతని భార్య క్సీ నాన్‌(Xie Nan)లను కూడా గుర్తించారు యూజర్లు.వు జంగ్ ది బ్యాటిల్ ఎట్ లేక్ చాంగ్‌జిన్‌తో సహా పలు చైనీస్ సినిమాల్లో పీఎల్ఏ (PLA) సైనికుడి పాత్రను పోషించాడు. వు భార్య క్సీ నాన్ కూడా యాక్టర్ అని యూజర్లు తెలిపారు. ఈమె 2007 డ్రామా సిరీస్, జియాన్ జింగ్ టియాన్ జియాలో నటించి బాగా పాపులర్ అయింది. నటీనటులు, దర్శకులు, జూనియర్ నటులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అధికారులు డిసెంబర్ 24, 2021న లొకేషన్‌కు వెళ్లారని మరో వీబో యూజర్ వెల్లడించారు. ఈ ప్రచార వీడియో గుట్టురట్టు చేసిన వీబో ఖాతాలపై చైనా విరుచుకుపడిందట. ఈ యూజర్ల వీబో అకౌంట్స్ ను తాత్కాలికంగా చైనా నిలిపివేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

చైనా వీడియోపై భారతదేశం ఎలా స్పందించింది
కొత్త సంవత్సరం రోజున గల్వాన్ లోయలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి.. ఫొటోను విడుదల చేసి చైనా ప్రచార వీడియో ఒక అబద్ధమని భారతీయ ఆర్మీ ప్రస్ఫుటం చేసింది. చైనీస్ వీడియో రిలీజైన మూడు రోజుల తర్వాత ఈ చిత్రాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు.

Artificial Sun: ఇక సూర్యుడితో పని లేదు.. అవును మీరు విన్నది నిజమే.. ఎందుకంటే..


చైనాపై కొరడా ఝులిపించిన భారత్
ప్రచార వీడియోలో పీఎల్ఏ (PLA) చేసిన వాదనలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి (MEA) అరిందమ్ బాగ్చి ఖండించారు. 'ఈ జర్నలిస్టులందరూ ప్రస్తావిస్తున్న వీడియో లేదా మీడియా నివేదికలన్నీ ఫేక్. వివిధ మీడియా సంస్థలు ప్రచార వీడియోలో చేసిన ఈ వాదనలకు విరుద్ధంగా ఫొటోలను విడుదల చేశాయి.' అని అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు ప్రామాణిక చైనీస్ పేర్లుగా పెట్టిన బీజింగ్‌ను కూడా భారత ప్రభుత్వం నిందించింది.

'టుటింగ్‌ను డౌడెంగ్‌గా లేదా రివర్‌ సియోమ్‌ను క్సీయుఎము (XiYueMu)గా లేదా కిబితును డాబాగా పిలిచినంత మాత్రాన.. అరుణాచల్ ప్రదేశ్‌ ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని భాగమేనన్న వాస్తవాన్ని అవాస్తవం చేయలేదు. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలలో వాస్తవాధీన రేఖ (LAC) పశ్చిమ సెక్టార్ వెంబడి ఉన్న ప్రాంతాలలో అత్యుత్తమ ఘర్షణ పాయింట్లను పరిష్కరించడానికి చైనా అటువంటి చేష్టలకు పాల్పడే బదులు నిర్మాణాత్మకంగా మాతో కలిసి పనిచేస్తుందని మేం ఆశిస్తున్నాం.' అని అరిందమ్ బాగ్చి తెలిపారు.

Two Womens: వారిద్దరు అమ్మాయిలు.. పైగా డాక్టర్స్.. చివరకు వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడండి..

ప్యాంగ్యాంగ్ సరస్సు మీదుగా చైనా వంతెనను నిర్మిస్తుందన్న వార్తలపై కూడా భారత్ స్పందించింది. "దాదాపు 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మిస్తోంది. భారతదేశం అటువంటి అక్రమ ఆక్రమణను ఎన్నడూ అంగీకరించలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు భారత భద్రతా ప్రయోజనాలను పూర్తిగా రక్షించడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది." అని అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. భారత్, చైనా 13వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలను అక్టోబర్, 2021లో నిర్వహించాయి. అయితే, భారత్ చేసిన సూచనలకు చైనా అంగీకరించకపోవడంతో చర్చలు స్తబ్దుగా ముగిశాయి. 14వ రౌండ్ సైనిక చర్చలను నిర్వహించాలనే ప్రతిపాదనపై బీజింగ్ నుంచి ప్రతిస్పందన కోసం భారత్ ఎదురుచూస్తోంది.
Published by:Veera Babu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు