దలైలామాతో చర్చించండి..చైనాకు అమెరికా సలహా

2010 సంవత్సరం తర్వాత దలైలామా, ఆయన తరఫు ప్రతినిధులతో నేరుగా చర్చలు జరపడం ఆపేసిన చైనా ప్రభుత్వం.

Janardhan V | news18
Updated: June 14, 2018, 11:28 AM IST
దలైలామాతో చర్చించండి..చైనాకు అమెరికా సలహా
టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు దలై లామా(ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: June 14, 2018, 11:28 AM IST
  • Share this:
టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాతో చైనా నేరుగా చర్చలు జరపాలని అగ్రరాజ్యం అమెరికా సలహా ఇచ్చింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సింగపూర్‌లో చర్చలు జరపడం తెలిసిందే. ట్రంప్‌, కిమ్‌ల మధ్య జరిగిన భేటీని గురించి దక్షిణ కొరియాకు వివరించడానికి అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో...ద.కొరియా రాజధాని సియోల్‌‌లో పర్యటించారు. అక్కడి నుంచి ఆయన బీజింగ్‌ చేరుకుని, చైనా నాయకత్వానికి కూడా చర్చల సారాంశాన్ని తెలియజేస్తారు.

బీజింగ్ బయలుదేరి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన మైక్ పాంపియా...టిబెట్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు దలైలామాతో లేదా ఆయన తరఫు ప్రతినిధులతో చైనా నేరుగా అర్థవంతమైన చర్చలు జరిపితే మంచదని అభిప్రాయపడ్డారు. చర్చలకు ముందు షరతులు ఉండరాదనీ ఆయన పేర్కొన్నారు. 2010 తర్వాత దలైలామా లేదా ఆయన తరఫు ప్రతినిధులు, చైనా ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు చర్చలు జరిపి, సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు మైక్ పాంపియా చెప్పారు.
Published by: Janardhan V
First published: June 14, 2018, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading