Home /News /international /

CHINA SENDS 30 WARPLANES INTO TAIWAN AIR DEFENCE ZONE PVN

China-Taiwan : టెన్షన్..టెన్షన్..తైవాన్ గగనతలంలోకి 30 యుద్ధ విమానాలు పంపిన చైనా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

China sends warplanes into Taiwan :  చైనాతైవాన్ మ‌ధ్య మ‌ళ్లీ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం మొద‌లైంది. సోమ‌వారం తైవాన్ ఎయిర్ ఢిఫెన్స్ లోకి చైనా 30 యుద్ధ విమానాల‌ను పంపిన‌ట్లు తెలుస్తోంది. అయితే చైనా చ‌ర్య‌కు దీటుగా యుద్ధ విమానాల‌ను మోహ‌రించిన‌ట్లు తాజాగా తైవాన్ వెల్ల‌డించింది.

ఇంకా చదవండి ...
China sends warplanes into Taiwan :  చైనాతైవాన్ మ‌ధ్య మ‌ళ్లీ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం మొద‌లైంది. సోమ‌వారం తైవాన్ ఎయిర్ ఢిఫెన్స్ లోకి చైనా 30 యుద్ధ విమానాల‌ను పంపిన‌ట్లు తెలుస్తోంది. అయితే చైనా చ‌ర్య‌కు దీటుగా యుద్ధ విమానాల‌ను మోహ‌రించిన‌ట్లు తాజాగా తైవాన్ వెల్ల‌డించింది. తైవాన్ పై చైనా దాడికి దిగితే తీవ్ర పరిణామాలుంటాయని,తాము తైవాన్ కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాను హెచ్చరించిన కొన్ని రోజుల తర్వాత ఇది జరిగింది. తైవాన్ వైమానిక ర‌క్ష‌ణ క్షేత్రంలో ఉన్న ప్ర‌టాస్ దీవుల వ‌ద్ద‌కు చైనా యుద్ధ విమానాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంట్లో 22 ఫైట‌ర్ జెట్స్ ఉన్నాయి. వాన్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చైనా త‌న వైమానిక కార్య‌క‌లాపాల‌ను పెంచింది. అయితే సైనిక శిక్ష‌ణ చేప‌డుతున్న‌ట్లు ఆ దేశం చెబుతున్నా తైవాన్ మాత్రం సందేహాలు వ్య‌క్తం చేస్తోంది. దీంతో రెండు దేశాల మ‌ధ్య మ‌ళ్లీ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.

ఇటీవల జపాన్‌ పర్యటన సందర్భంగా బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తైవాన్‌ విషయంలో చైనా బలవంతంగా జోక్యం చేసుకొంటే.. అమెరికా సైనికపరంగా స్పందిస్తుంది. అది మేం చేసిన వాగ్దానం’ అని తెలిపారు. దీనిపై స్పందించిన చైనా.. అమెరికా నిప్పుతో ఆడుకుంటోందని ఘాటుగా విమర్శించింది. తైవాన్‌ విషయంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకొంటామని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ పునరుద్ఘాటించారు.

ALSO READ Putin Losing Eyesight: కంటిచూపు కోల్పోతున్న పుతిన్..పుతిన్ మూడేళ్లకు మంచి బతకడట!

చైనా-తైవాన్ సంబంధాలు
దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్. 1940ల్లో జరిగిన సివిల్ వార్ సమయంలో చైనా-తైవాన్ లు విడిపోయాయి. అయితే ఏదోఒకరోజు అవసరమైతే ఒలవంతంగానైనా తైవాన్ ను మళ్లీ పూర్తీగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని చైనా చెబుతోంది. తైవాన్‌ను తనలో శాంతియుతంగా కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ తైవాన్ ప్రజలు, ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. అది స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా, అధికారికంగా చైనా నుంచి దానికి స్వతంత్రం లభించలేదు. చైనా ఇప్పటికీ దాన్ని తమ రాష్ట్రాల్లో ఒకటిగానే పరిగణిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం కారణంగా నిత్యం రెండు దేశాల మధ్య హింస చెలరేగే ప్రమాదం పొంచే ఉంటుంది. ఆ వివాదంలో అమెరికా కూడా కల్పించుకునే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఇక,1980లో చైనీ-తైవాన్ మధ్య సంబంధాలు కొంచెం మెరుగుపడ్డాయి. ఇందులో భాగంగానే ‘ఒక దేశం- రెండు వ్యవస్థల’ సూత్రాన్ని చైనా తీసుకొచ్చింది. చైనాతో మళ్లీ కలిసిపోవడానికి తైవాన్ ఒప్పుకుంటే, ఆ ద్వీపానికి పాలనలో స్వతంత్రతను కల్పిస్తామని చైనా చేసిన ప్రతిపాదనకు తైవాన్ అంగీకరించలేదు.

అసలు వివాదం ఎలా మొదలైంది?

తైవాన్ లో మొదట చైనా నుంచి వలస వెళ్లిన “ఆస్ట్రోనేసియన్” గిరిజన ప్రజలు స్థిరపడినట్లు భావిస్తున్నారు. క్రీ.శ.239లో చైనాకు చెందిన దండయాత్రికులు తైవాన్‌ను మొదట గుర్తించినట్లు చైనా రికార్డులను చూపెడుతోంది. ఆ కారణంగానే తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తుంది. 1624-1661 మధ్య డచ్ పాలకుల అధీనంలో ఉన్న తైవాన్, ఆ తర్వాత 200 ఏళ్లకు పైగా(1683-1895) చైనాకు చెందిన క్వింగ్ సామ్రాజ్యం పాలనలోనే కొనసాగింది. 17వ శతాబ్దం మొదట్లో చైనాలోని కఠిన పరిస్థితులను తాళలేక ప్రధానంగా ఫూజియన్, గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రాల ప్రజలు తైవాన్‌ కు పెద్ద సంఖ్యలో సంఖ్యలో వలస వెళ్లారు. ప్రస్తుతం తైవాన్‌లో నివసిస్తున్న ప్రజల్లో ఎక్కువ మంది ఆ రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన వారి వారసులే.

1895లో మొదటి సైనో-జాపనీస్ యుద్ధంలో క్వింగ్‌ ప్రభుత్వం ఓడిపోయింది. దీంతో తైవాన్.. జపాన్ అధీనంలోకి వెళ్లిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తైవాన్‌ పై నియంత్రణను జపాన్ వదులుకుంది. అమెరికా, బ్రిటన్ దేశాల అనుమతితో తైవాన్‌ను మళ్లీ చైనా పాలించడం మొదలుపెట్టింది. కానీ, ఆ తర్వాత కొన్నేళ్లకే చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి చైనా నాయకుడు షియాంగ్ కై-షెక్ బలగాలను మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు బలగాలు చిత్తు చేశాయి. దాంతో 1949లో షియాంగ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న దాదాపు 15లక్షల మంది ప్రజలు తైవాన్‌కు వెళ్లిపోయారు. తైవాన్ జనాభాలో వాళ్ల సంఖ్య 14శాతమే అయినా, చాలా ఏళ్ల పాటు వాళ్లే అక్కడి రాజకీయాలను శాసించారు. చనిపోయేవరకు షియాంగ్‌ తైవాన్‌ను పాలించాడు. ఆ తరువాత షియాంగ్ కొడుకు షియాంగ్ చింగ్-కో అధికారం చేపట్టాడు. కానీ, తైవాన్‌లో ప్రజాస్వామ్య ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆయన 2000 సంవత్సరంలో ఎన్నికలకు అనుమతిచ్చాడు. అలా తైవాన్‌లో తొలిసారి షియాంగ్ కుటుంబ పాలన ముగిసింది. తైవాన్ కు ఇప్పుడు సొంత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన నేతలు ఉన్నారు. తైవాన్ సాయుధ బలగాల్లో.. 3లక్షల యాక్టివ్ ట్రూప్స్ ఉన్నాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: China, Taiwan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు