High Speed Trains: అణ్వాయుధాలను తరలించగల, ప్రయోగించగల హైస్పీడ్ రైలు(High Speed Trains).. ‘మిసైల్ ట్రైన్(Missile Train)’ను తయారు చేసే యత్నాల్లో చైనా(China) నిమగ్నమైంది. డూమ్స్‌డే ట్రైన్‌పై పరిశోధనలను మిలటరీని(Military) ఆధునికీకరించే వ్యూహాల్లో భాగమని చైనా(China) సంకేతాలు తెలుపుతున్నాయి. చైనాకి చెందిన ఎలైట్ DF-41 న్యూక్లియర్ మిసైల్స్‌ను(Nuclear Missile) రైలు నెట్‌వర్క్‌లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో బీజింగ్ ఇంజినీర్లు(Engineers) ఉన్నారు. 80 టన్నుల బరువు గల మెగా మిస్సైల్స్‌కు లాంచ్‌ప్యాడ్ (Launch Pad) నుంచి 9,300 మైళ్ల వరకు న్యూక్లియర్ వార్‌హెడ్‌లను(War head) మోయగల శక్తి ఈ హైస్పీడ్ ట్రైన్స్ కు(High Speed Trains) ఉంది. 2015లో రైళ్ల నుంచి DF-41 న్యూక్లియర్ మిసైల్స్‌ను ప్రయోగించినట్లు చైనా ప్రకటించినా దానికి సంబంధించి ఆధారాలు మాత్రం లభించలేదు. 2019లో తొలిసారిగా బహిర్గతం చేసిన ఈఈ న్యూక్లియర్ మిస్సైల్స్.. గ్రహం మీద అత్యంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవని గుర్తింపు.
‘డూమ్స్‌డే ట్రైన్స్’ చైనా మిలటరీకి ఎలా ఉపయోగపడతాయి..?
చైనా రైల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా న్యూక్లియర్ వెపన్స్‌ను ప్రయోగించే అవకాశం. రైళ్లలో న్యూక్లియర్ వెపన్స్ తరలించడం ద్వారా సమర్థంగా దాడులు చేయగలరని చైనా ఇంజినీర్లు చెబుతున్నారు. న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేసే సమయంలో వెలువడే షాక్‌వేవ్‌లను హై స్పీడ్ ట్రైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తట్టుకోగలదని ఇంజినీర్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు . సౌత్‌వెస్ట్ జియాటోంగ్ యూనివర్సిటీలో ‘ డూమ్స్‌డే ట్రైన్స్’కు సంబంధించి జర్నల్ ప్రచురితం అయింది. సైనిక వాహనాల కదలిక, భద్రత, ఆయుధాలను దాచడం హై స్పీడ్ రైళ్లలో మెరుగ్గా ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇంజినీర్ల బృందాన్ని నడిపిస్తున్న చైనా ప్రభుత్వ జాతీయ పరిశోధన ప్రాజెక్ట్‌కి ప్రొఫెసర్ యిన్ జిహాంగ్ నాయకత్వం వహిస్తున్నారు.
తీవ్రతను చైనా హై స్పీడ్ ట్రైన్ నెట్‌వర్క్ తట్టుకోగలదా..?
ఇరవై ఏళ్లలోపే ప్రపంచంలోనే అతిపెద్ద హై-స్పీడ్ ట్రైన్ నెట్‌వర్క్‌ను చైనా నిర్మించినట్లు నిపుణులు చెబుతున్నారు. రెండో స్థానంలో ఉన్న స్పెయిన్, మూడో స్థానంలోని జపాన్‌ను అధిగమించేందుకు చైనా ట్రైన్ నెట్‌వర్క్ అభివృద్ధి చేసింది. న్యూక్లియర్ వెపన్స్ తరలించే హై-స్పీడ్ ట్రైన్స్ గరిష్ఠ వేగం గంటకు 217 మీటర్లు. అయినప్పటికీ కొన్ని తక్కువ-ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్‌లతో రైళ్లకు ముప్పు ఉందని పరిశోధకుల హెచ్చరిస్తున్నారు. ICBM లాంచ్‌తో ఉత్పత్తి అయ్యే శక్తివంతమైన షాక్ వేవ్ చాలా రైలు మార్గాల బేస్ స్ట్రక్చర్ మందాన్ని దాటగలదని రిపోర్ట్స్.
వెపన్స్ ప్రయోగంతో రైలు మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయని.. అనంతరం నిరుపయోగంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. సిలోస్, ట్రక్కులతో పోలిస్తే అణు దాడులను రైళ్లు తట్టుకోగలవని సైనిక నిపుణులు చెబుతున్నారు. మిసైల్ ప్రయోగంతో కలిగే చాలా అవాంతరాలు ట్రైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. న్యూక్లియర్ సబ్‌మెరైన్ మోయగలిగినన్ని మిసైల్స్‌ను ట్రైన్‌లో తరలించవచ్చని అంచనా.
రైళ్ల ద్వారా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగం.. దశాబ్ధం క్రితం నాటి ఆలోచన..
రైళ్ల ద్వారా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగం పాత ఆలోచన.. దశాబ్దాల క్రితమే సోవియట్ యూనియన్ ప్రయత్నించింది. 1980లో ట్రైన్ ద్వారా బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ సిస్టమ్ అభివృద్ధి చేసింది. ఒక రైలు బోగిలో సరిపడే ఆర్‌టీ-23 మోలోడెట్స్ ICBMని డెవలప్ చేసింది సోవియట్ యూనియన్. సాలిడ్ ఫ్యూయల్‌తో లాంచ్ అయ్యే 2.4 మీటర్ల వ్యాసార్థం ఉండే మిసైల్‌కు పదివేల కిలీమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంటుంది.
సోవియట్ లాంచింగ్ సిస్టమ్‌కు 550 కిలోటన్నుల న్యూక్లియర్ వార్‌హెడ్స్ సామర్థ్యం.. రీ ఎంట్రీలో దాడులు చేసేలా ఏర్పాట్లు చేశారు.యూఎస్ డిఫెన్స్ గ్లోబల్ సిస్టమ్‌కి ధీటుగా చైనా మిలిటరీ బలోపేతానికి చర్యలు చేపడుతోంది. అమెరికా రక్షణ వ్యవస్థలను ఎదుర్కొనేందుకు రష్యా, చైనా, ఉత్తర కొరియాలు కూడా అన్వేషణలు సాగిస్తున్నారు. హైపర్‌సోనిక్ మిసైల్స్ కోసం సిస్టమ్స్‌ను యూఎస్ అభివృద్ధి చేయడంతో న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగ మార్గాలపై చైనా దృష్టి పెట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, High speed trains, Missile, Network