ట్రంప్ జోక్యం అవసరం లేదు.. ఇండియాతో వివాదంపై చైనా వ్యాఖ్యలు

భారత ప్రభుత్వంతో అమెరికా ఎలాంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. చివరిసారిగా ఏప్రిల్ 4న ట్రంప్, మోదీ మాట్లాడుకున్నారని.. అది కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించే చర్చించారని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

news18-telugu
Updated: May 29, 2020, 2:46 PM IST
ట్రంప్ జోక్యం అవసరం లేదు.. ఇండియాతో వివాదంపై చైనా వ్యాఖ్యలు
ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్, జింపింగ్
  • Share this:
ఇండియా-చైనా సరిహద్దు వివాదంలో మూడో వ్యక్తి కలగజేసుకోవాల్సిన అవసరం లేదని చైనా స్పష్టం చేసింది. చైనా, ఇండియా వివాద పరిష్కారానికి అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించింది చైనా. డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. చర్చల ద్వారానే సామరస్య పూర్వకంగా సమస్యలను పరిస్కరించుకుంటామని తెలిపింది.


కాగా, ఇండియా, చైనా వివాదంపై ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇరుదేశాల సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని.. ఈ విషయమై ఇండియా, చైనాతో చర్చించామని ట్వీట్ చేశారు. ఐతే ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ ఖండించింది. భారత ప్రభుత్వంతో అమెరికా ఎలాంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. చివరిసారిగా ఏప్రిల్ 4న ట్రంప్, మోదీ మాట్లాడుకున్నారని.. అది కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించే చర్చించారని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
First published: May 29, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading