హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China : రష్యాపై అమెరికా ఆంక్షలు..చైనా కీలక వ్యాఖ్యలు

China : రష్యాపై అమెరికా ఆంక్షలు..చైనా కీలక వ్యాఖ్యలు

రష్యాపై ఆంక్షల విషయంలో చైనా కీలక వ్యాక్యలు

రష్యాపై ఆంక్షల విషయంలో చైనా కీలక వ్యాక్యలు

Sanctions On Russia : ఉక్రెయిన్‌ పై యుద్ధానికి దిగిన ర‌ష్యాపై అమెరికా సహా పలు దేశాలు తీవ్ర ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, వాణిజ్యపరమైన అంశాలపై రష్యాపై ఆంక్షలు పెట్టాయి.

China On USA Sanctions On Russia :  ఉక్రెయిన్‌ పై యుద్ధానికి దిగిన ర‌ష్యాపై అమెరికా సహా పలు దేశాలు తీవ్ర ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, వాణిజ్యపరమైన అంశాలపై రష్యాపై ఆంక్షలు పెట్టాయి. అయితే రష్యాపై అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల అందరికీ నష్టం జరుగుతుందని చైనా తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయేల్ అల్బేర్స్‌తో ఫోన్‌ లో ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో చైనాకు ఎటువంటి సంబంధం లేదని, అందులో చైనా పాత్రే లేదని ఆయన చెప్పారు. అయితే పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల ప్రభావం చైనాపై పడాలని తాము కోరుకోవడం లేదని, చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునే హక్కు చైనాకు ఉందని చెప్పారు.

అంతకుముందు ఆంక్షల నేపథ్యంలో సైనికంగా, ఆర్థికంగా ఆదుకోవాల‌ని ర‌ష్యా త‌న మిత్ర‌దేశ‌మైన చైనా సాయాన్ని కోరిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన త‌ర్వాత చైనా సైనిక స‌హాయాన్ని ర‌ష్యా కోరిన‌ట్లు చాలా వార్తా సంస్థ‌లు నివేదిక‌లు ప్ర‌చురించాయి. త‌మకు డ్రోన్లు కావాలంటూ చైనాను ర‌ష్యా కోరిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఒక‌వేళ ర‌ష్యాకు చైనా స‌హ‌క‌రిస్తే, అప్పుడు ఆ దేశం తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని అమెరికా వార్నింగ్ జారీ చేసింది. దానిపై చైనా ప్రతిస్పందిస్తూ తమను రష్యా ఏ విధమైన సహాయాన్ని కోరలేదని వివరణ ఇచ్చింది. అయితే యుద్ధంపై చైనా మళ్లీ తన గళాన్ని విప్పింది. రష్యాపై అమెరికా పెడుతున్న ఆంక్షల వల్ల అందరికీ నష్టం జరుగుతుందని, తమకూ హక్కులు ఉన్నాయని అమెరికాకు గుర్తు చేసింది.

First published:

Tags: China, Russia, Russia-Ukraine War, USA

ఉత్తమ కథలు